నవతెలంగాణ గోవిందరావుపేట : మట్టి వినాయకులతో అంతా మంచే జరుగుతుందని వందన పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి సంతోష్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో గల వందన స్కూల్ నందు మట్టి వినాయకుల ప్రాముఖ్యత తెలుపుతూ,మట్టి వినాయకులను తయారు చేస్తూ వినాయక చవితి పండుగ ప్రాముఖ్యతను పిల్లలకు ప్రధానోపాధ్యాయులు సంతోష్ వివరించారు. ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ 27 తేదీన బుధవారం రోజున జరగబోయే వినాయక చవితి ప్రాముఖ్యతను పండగ విశేషాలను పిల్లలకు తెలుపుతూ మట్టి ప్రతిమల వల్ల కలిగే మంచిని వివరించినారు. భారత దేశంలోనే అతి ముఖ్యమైన పండుగలలో కులమత బేధాలు లేకుండా హిందూ,ముస్లిం,క్రిస్టియన్ అని తారతమ్యాలు లేకుండా చేసుకునే ఏకైక పండుగ వినాయక చవితి పండగ అని ఇలాంటి పండగ దేశంలోనే ఎంతో ఘనత ఉందని విద్యార్థిని విద్యార్థులకు తెలిపినారు. పండగ సమయంలో రంగులు దిద్దిన ప్రతిమలు కాకుండా మట్టితో తయారు చేసిన వినాయక ప్రతిమలనే వాడాలని అలా వాడడం వల్ల పర్యావరణానికి ఎలాంటి ముప్పు వాటిల్లదని పిల్లలతో మట్టి వినాయక ప్రతిమలను చేసి పూజలు జరిపించినారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఉపాధ్యాయురాలు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
మట్టి వినాయకుడితో అంతా మంచే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES