డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజరు పాల్ రెడ్డి అడిదల నిర్మించిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. మోహన్ శ్రీవత్స దర్శకుడు. సత్యరాజ్, ఉదయభాను, వశిష్ట ఎన్ సింహా, సత్యం రాజేష్, క్రాంతి కిరణ్, సాంచీ రారు నటించారు. ఈ సినిమా ఈనెల 29న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్మాత విజరు పాల్ రెడ్డి అడిదల మీడియాతో మాట్లాడుతూ, ‘దర్శకుడు మోహన్ చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. ఇది కొత్త రకమైన కథ. చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. మలయాళంలో తీసినట్టుగా చాలా సహజంగా తీశాం. తెలుగు ఆడియెన్స్‌కు కావాల్సిన కమర్షియల్ అంశాల్ని కూడా జోడించాం. ఈ కథకు మైథలాజికల్ జోనర్‌ను యాడ్ చేసి చెప్పడమే కొత్తగా ఉంటుంది. వరంగల్, విజయవాడలో ప్రీమియర్లు వేశాం. అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సినిమాను చూసిన వారిలో చాలా మంది కన్నీళ్లు పెట్టుకున్నారు. మూవీ అద్భుతంగా ఉందని అందరూ పొగిడారు. మాకు అదే చాలా సంతప్తినిచ్చింది. కథతో పాటు టెక్నికల్ పరం గానూ చాలా కొత్తగా ఉంటుంది. ఇందులో ఇన్ ఫ్యూజన్ బ్యాండ్‌ను తీసుకొచ్చాం. వారు ఇచ్చిన పాటలు, ఆర్‌ఆర్ అద్భుతంగా వచ్చింది. కెమెరామెన్ కుశేందర్ రమేష్ రెడ్డి విజువల్స్ వర్క్ అందరినీ ఆకట్టుకుంటుంది. మైత్రి వాళ్లు నైజాంలో మా చిత్రాన్ని భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ విషయంలో దర్శకుడు మారుతి సహకారం మరువలేనిది. ఆయన ఈ చిత్రాన్ని చూసి చాలా బాగుందని మెచ్చుకున్నారు. మా బ్యానర్‌లో రాబోతున్న మరో చిత్రం ‘బ్యూటీ’. ఇది పూర్తిగా ఫ్యామిలీ, కమర్షియల్ చిత్రం. ఓ హర్రర్ కామెడీ కథ నచ్చడంతో ఓకే చేశాను. మరో రెండు ప్రాజెక్టులు కూడా లైన్లో ఉన్నాయి. అవి ఇంకా చాలా డిఫరెంట్‌గా ఉంటాయి’ అని తెలిపారు.
డిఫరెంట్ కంటెంట్ ఉన్న సినిమా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES