– సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు
– న్యాయసేవ సంస్థను ఆశ్రయించిన బాధితుడు
– 5గురు మెడికో విద్యార్థుల సస్పెన్షన్
నవతెలంగాణ కంఠేశ్వర్ : విద్యానభ్యసిస్తూ భవిష్యత్ ను బంగారుమయం చేసుకోవలసిన విద్యార్థులు ర్యాగింగ్ అనే రాక్షస క్రీడను అలవాటు చేసుకోవడం దృరదృష్టకరమని నిజామాబాద్ జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్ మెడికల్ కళాశాలలో రాహుల్ రెడ్డి అనే మెడికల్ విద్యార్థిపై కొందరు ర్యాగింగ్ చేస్తూ దాడికి పాల్పడిన విషయం తెలుకున్న ఆయన సోమవారం మెడికల్ కళాశాలను సందర్శించి విద్యార్థులు, విద్యార్థినిలతో మాట్లాడారు.ర్యాగింగ్ విషసంస్కృతిని కఠినంగా అణచివేయాల్సిన అవసరాన్ని భారత సుప్రీంకోర్టు ఎరుక జేసిందని ఆయన తెలిపారు. ర్యాగింగ్ కు పాల్పడే విద్యార్థులను కాలేజీ నుండి సస్పెన్షన్, జరిమానాయే కాకుండా విద్య సంవత్సరం పూర్తి కాకుండానే కాలేజీ నుండి పంపి వేయడం జరుగుతుందని అన్నారు. పరీక్ష ఫలితాల నిలిపివేత, హాస్టల్ నుండి పంపించివేయడం అనే చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.ర్యాగింగ్ చేసినవారు, ప్రోత్సహించినవారు శిక్షార్హులేనని తెలిపారు.గాయపరచితే రెండు సంవత్సరాల వరకు జైలుశిక్ష లున్నాయని ఆయన అన్నారు. తల్లితండ్రులు కస్టపడి చదివిస్తున్నారని, వారి కష్టానికి ప్రతిఫలంగా విద్యలో ఉత్తీర్ణులు కావడమే లక్ష్యంగా విద్యాబ్యాసం ఉండాలని ఉద్బోడించారు.కళాశాలకు వచ్చింది విద్యాబ్యాసానికే గాని ర్యాగింగ్ చేయడానికి కాదనేది విద్యార్థులు గుర్తేరగాలని ఆయన అన్నారు. న్యాయమూర్తి ఉదయ్ భాస్కర్ రావు వెంట మెడికల్ అదనపు సూపరింటెండెంట్ డాక్టర్ రాములు,కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ జలగం తిరుపతి రావు, నిజామాబాద్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మాణిక్ రాజు, చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ రాజ్ కుమార్ సుబేదార్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్స్ విశ్వక్ సేన్ రాజ్, బాలాజీ, మహిపాల్ తదితరులు ఉన్నారు.
న్యాయసేవ సంస్థను ఆశ్రయించిన బాధితుడు
తోటి విద్యార్థుల ర్యాగింగ్ కు బలైన విద్యార్థి గౌరవరం రాహుల్ రెడ్డి సోమవారం జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జికి న్యాయ సహాయం చేయాల్సిందిగా వినతిపత్రం అందజేశారు. రాహుల్ తన తల్లితండ్రులతో కలిసి వచ్చారు.
5గురు మెడికో విద్యార్థుల సస్పెన్షన్
నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలకు చెందిన ఎంబీబీఎస్ నాల్గవ సంవత్సరం విద్యార్థి పై ర్యాగింగ్ చేసి దాడులకు పాల్పడ్డ ఆరుగురు సీనియర్ ఎంబీబీఎస్ విద్యార్థులను సస్పెన్షన్ చేసినట్లు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా.క్రిష్ణమోహన్ తెలిపారు. సోమవారం ప్రిన్సిపాల్ చాంబర్ లో యాంటీ ర్యాగింగ్ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో ఇరువర్గాల వాదనలు విని జూడా మెంబర్స్ తో మాట్లాడిన అనంతరం 5గురు వైద్య విద్యార్థులపై ఆరు నెలల పాటు సస్పెన్షన్ వేటు వేశారు. ఇమిడియెట్ మెజర్స్ కింద సస్పెన్షన్ చేయడంతో పాటు హాస్టల్ నుంచి శాశ్వతంగా తొలగించారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ అంకిత్, డీసీపీ బస్వారెడ్డి, ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్, అడిషనల్ సూపరింటెండెంట్ రాములు, వైస్ ప్రిన్సిపాల్ తిరుపతిరావు, ప్రొ. నాగమోహన్ తదితరులున్నారు.
ర్యాగింగ్ ను మొగ్గలోనే తుంచివేద్దాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES