Tuesday, May 6, 2025
Homeజాతీయంక‌ర్నాట‌కలో ఎస్సీ కులాల గ‌ణ‌న చేప‌డుతాం: సీఎం సిద్ద‌రామ‌య్య

క‌ర్నాట‌కలో ఎస్సీ కులాల గ‌ణ‌న చేప‌డుతాం: సీఎం సిద్ద‌రామ‌య్య

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: క‌ర్నాట‌క‌లోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా కుల‌గ‌ణ‌నతోపాటు ప్ర‌త్యేకంగా షెడ్యూల్డ్ కులాలు(sc), దాని అనుబంధ ఉప‌కులాల‌ను లెక్కిస్తామ‌ని సీఎం సిద్ద‌రామ‌య్య చెప్పారు. నేటినుంచి మే 17వ‌ర‌కు ప్ర‌క్రియ కొన‌సాగుతుంద‌న్నారు. మొత్తం మూడు ద‌శ‌లో ఈలెక్కింపును పూర్తి చేస్తామ‌న్నారు. మొద‌టి ద‌ఫా ఇంటింటికి వెళ్లి ఆయా వ‌ర్గాల స‌మాచారాన్ని సేక‌రిస్తామ‌ని, రెండో ద‌శ‌లో ప్ర‌త్యేక క్యాంప్‌లు నిర్వ‌హించి డేటా న‌మోదు చేస్తామ‌ని తెలిపారు. మూడో ఫేజ్‌లో ఆన్‌లైన్ వేదిక‌గా కులాల వివ‌రాల న‌మోదు అవ‌కాశం క‌ల్పిస్తామ‌ని వెల్ల‌డించారు. దీని కోసం హోకోర్టు జ‌డ్జి నాగమోహన్ దాస్ అధ్య‌క్ష‌త‌న ఏక‌స‌భ్య క‌మిష‌న్ వేశామ‌ని, ఈ క‌మిటీ ఆధ్వ‌ర్యంలో ఈప్ర‌క్రియ కొన‌సాగుతుంద‌ని సీఎం చెప్పారు. కర్ణాటకలో షెడ్యూల్డ్ కులాల కింద 101 కులాలు జాబితా చేయబడ్డాయ‌ని, వాటిలో ఎడమ – కుడిచేతి వాటం, లమానీ, కొరమా, కొరచా వంటి ఉప సమూహాలు ఉన్నాయ‌న్నారు. ప్రతి సమూహం జనాభాపై త‌మ‌కు స్పష్టమైన డేటా అవసరం, ఖచ్చితమైన డేటా ఆధారంగా ఎస్సీ వర్గాలలో అంతర్గత రిజర్వేషన్లను అమలు చేయడానికి త‌మ ప్రభుత్వం కట్టుబడి ఉంద‌ని సిద్ధరామయ్య అన్నారు. 2011 జనాభా లెక్కల్లో వివరణాత్మక ఉప-కుల సమాచారం లేద‌ని, ఇది న్యాయమైన విధాన నిర్ణయాలకు అవసరమైన వ్యాయామని ఆయ‌న వివ‌రించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -