నవతెలంగాణ-హైదరాబాద్: ట్రేడ్ వార్ పేరుతో చైనాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మేకపోతు గంభీర్యాం ప్రదర్శించిన విషయం తెలిసిందే. యూఎస్ సుంకాలకు బెదరని బీజింగ్..తనదైన శైలిలో అమెరిగా దిగుమతులపై అదే స్థాయిలో టారిప్‌లు విధించారు. దీంతో చర్చలతో పేరుతో చైనాతో రాజీ..ఇరుదేశాలు టారిఫ్‌లపై ఏకాభిప్రాయానికి వచ్చి..ట్రేడ్ వార్ కు ముగింపు పలికాయి. తాజాగా మరోమారు చైనాపై మాటల యుద్ధానికి ట్రంప్ తెరలేపారు.
చైనాను నాశనం చేయగల అద్భుతమైన కార్డులు తన దగ్గర ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యుంగ్‌తో ట్రంప్ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఓవల్ కార్యాలయంలో ట్రంప్ మాట్లాడుతూ.. వాణిజ్య యుద్ధంలో బీజింగ్ కంటే వాషింగ్టన్ స్థానం బలంగా ఉందని వ్యాఖ్యానించారు. చైనాను నాశనం చేయగల అద్భుతమైన కార్డులు తమ దగ్గర ఉన్నాయని.. తాను ఇంకా పట్టుకోలేదని చెప్పారు.
చైనాతో తమకు గొప్ప సంబంధం ఉండబోతుందన్నారు. వారికి కొన్ని కార్డులు ఉన్నాయి.. అలాగే మా దగ్గర కూడా అద్భుతమైన కార్డులు ఉన్నాయని చెప్పారు. కానీ ఆ కార్డులతో ఆడాలనుకోవడం లేదని పేర్కొన్నారు. ఆడితే మాత్రం చైనాను నాశనం చేస్తుందని చెప్పుకొచ్చారు. అందుకే ఆ కార్డులు ఆడబోవడం లేదని ట్రంప్ వివరించారు.
ఇక ఆగస్టు 12న చైనాపై విధించిన సుంకాలను 90 రోజుల పాటు పొడిగించారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య చర్చలు నడుస్తున్నాయి. అరుదైన ఖనిజాల సరఫరాను నిలిపివేస్తే చైనాపై 200 శాతం సుంకాలు విధించేందుకు కూడా వెనుకాడబోమని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఆటోమొబైల్, రక్షణ రంగానికి అవసరమైన మ్యాగ్నెట్స్ సరఫరాను చైనా కొనసాగించాల్సిందేనని ట్రంప్ స్పష్టం చేశారు.