నవతెలంగాణ-హైదరాబాద్: నేడు అహ్మదాబాద్‌లో హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాల కోసం లిథియం – అయాన్ బ్యాటరీ తయారీ కేంద్రాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోడీ మాట్లాడుతూ.. ‘ఈ లిథియం అయాన్ బ్యాటరీ తయారీ కేంద్రం భారతదేశం యొక్క మేక్ ఇన్ ఇండియాకు కొత్త అధ్యాయానికి నాంది పలికింది. ఇది భారత్ యొక్క మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్ లక్ష్యాల సాధనలో పెద్ద ముందడుగు’ అని ఆయన అన్నారు.
దేశంలో ప్రారంభమైన ఈ కేంద్రం ద్వారా భారత్ వంద దేశాలకు ఎలక్ట్రిక్ వాహనాలను ఎగుమతి చేయనుంది. గణేష్ ఉత్సవం రోజున ప్రారంభించిన ఈ కేంద్రం మేక్ ఇన్ ఇండియా కొత్త అధ్యాయంకు నాంది. ఈరోజు భారత్‌కు జపాన్ మధ్య స్నేహబంధానికి కొత్త కోణాన్ని అందిస్తోంది. ఒక విధంగా ఇరు దేశాల మధ్య స్నేహానికి 13 ఏళ్లు. అంటే టీనేజ్. ఈ వయసు రెక్కలు విప్పే కాలం. కలలు ఉద్భవించే కాలం. ఈరోజు మారుతి సుజుకి టీనేజ్ సంవత్సరాల్లోకి అడుగుపెడుతున్నందుకు సంతోషంగా ఉన్నాను. గుజరాత్ ముఖ్యమంత్రిగా నేనున్న సమయంలో 2012లో హన్సల్‌పూర్‌లో సుజుకి భూమిని కేటాయించాను. భారత్ విజయగాథకు బీజాలు 13 సంవత్సరాల క్రితమే నాటాము’ అని అన్నారు.
భారతదేశానికి ప్రజాస్వామ్యశక్తి, జనాభా ప్రయోజనమూ ఉన్నాయని మోడీ అన్నారు. దేశంలో నైపుణ్యం కలిగిన శ్రామికశక్తి పెద్ద సంఖ్యలో ఉంది. ఇది ప్రతి భారతీయ భాగస్వామికి గెలుపును అందిస్తుందని ప్రధాని తెలిపారు. జపాన్‌కు చెందిన సుజుకీ భారత్‌లో ఉత్పత్తి చేస్తోంది. ఇక్కడ తయారైన కార్లను జపాన్‌కు తిరిగి ఎగుమతి చేస్తామని మోడీ పేర్కొన్నారు.