Tuesday, May 6, 2025
Homeఆటలుఐసీసీ ర్యాంకింగ్స్ విడుదల...

ఐసీసీ ర్యాంకింగ్స్ విడుదల…

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఐసీసీ సోమవారం విడుదల చేసిన పురుషుల క్రికెట్‌కు చెందిన వార్షిక ర్యాంకింగ్స్‌లో వైట్-బాల్ ఫార్మాట్లలో టీమిండియా తన ఆధిపత్యాన్ని కొన‌సాగించింది. వన్డేలు, టీ20లలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. కానీ, రెడ్‌-బాల్ ఫార్మాట్‌లో మాత్రం నాలుగో స్థానానికి పడిపోయింది. ఇందులో ఆస్ట్రేలియా టాప్‌లో ఉంది. 2024 మే నుంచి ఆడిన మ్యాచ్‌ల ఆధారంగా ర్యాంకుల‌ను వెల్ల‌డించింది. వ‌న్డే ర్యాంకుల్లో టీమిండియా అగ్ర‌స్థానంలో ఉంది. ఇటీవ‌ల ఐసీసీ చాంపియ‌న్స్ ట్రోఫీని గెలుచుకున్న‌ భార‌త్ త‌న రేటింగ్ పాయింట్ల‌ను 122 నుంచి 124కు పెంచుకుని టాప్ ర్యాంక్ కైవ‌సం చేసుకుంది. చాంపియ‌న్స్ ట్రోఫీ ర‌న్న‌ర‌ప్ గా నిలిచిన న్యూజిలాండ్ రెండో స్థానంలో కొన‌సాగుతోంది. ఇక ఆస్ట్రేలియా మూడో స్థానంలో ఉంది. అటు, టీ20ల్లో టీమిండియానే టాప్‌లో ఉంది. రెండో స్థానంలో ఆస్ట్రేలియా ఉండ‌గా… ఆ త‌ర్వాతి స్థానాల్లో వ‌రుస‌గా ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, వెస్టిండీస్ జ‌ట్లు ఉన్నాయి. కాగా, టెస్టుల్లో ఆస్ట్రేలియా అగ్ర‌స్థానంలో కొన‌సాగుతోంది. ఆ జ‌ట్టు వార్షిక పాయింట్లు 15 నుంచి 13కు త‌గ్గినా… పాట్ క‌మ్మిన్స్ నేతృత్వంలోని ఆసీస్‌ 126 ఓవరాల్ పాయింట్ల‌తో టాప్‌లో నిలిచింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -