Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంమద్రాస్ హైకోర్టును ఆశ్ర‌యించిన శ్రీదేవి భర్త బోనీ కపూర్

మద్రాస్ హైకోర్టును ఆశ్ర‌యించిన శ్రీదేవి భర్త బోనీ కపూర్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: శ్రీదేవి భర్త, ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ మద్రాస్ హైకోర్టు మెట్లెక్కారు.ఆ ముగ్గురి దావా చట్టవిరుద్ధమని, స్పష్టంగా మోసపూరితమైనదని ఆయన తన పిటిషన్‌లో తీవ్ర ఆరోపణలు చేశారు. చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్ (ఈసీఆర్)లో ఉన్న ఈ ఆస్తిని కపూర్ కుటుంబం తమ ఫామ్‌హౌస్‌గా ఉపయోగిస్తోంది.

బోనీ కపూర్ హైకోర్టుకు సమర్పించిన వివరాల ప్రకారం, శ్రీదేవి ఈ ఆస్తిని 1988 ఏప్రిల్ 19న ఎం.సి. సంబంధ మొదలియార్ అనే వ్యక్తి నుంచి చట్టబద్ధంగా కొనుగోలు చేశారు. అయితే, ఇటీవల ముగ్గురు వ్యక్తులు తెరపైకి వచ్చి తామే ఆ ఆస్తికి అసలైన వారసులమని వాదించడం మొదలుపెట్టారు. ఆయ‌న పిటిష‌న్ పై విచార‌ణ చేప‌ట్టిన కోర్టు నాలుగు వారాల్లోగా ఒక నిర్ణయం తీసుకోవాలని తాంబరం తాలూకా తహసీల్దార్‌ను ఆదేశించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad