Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంఆ గణేశ్ విగ్రహాం.. దేశంలోనే అత్యంత ఖ‌రీదైన‌ది..!

ఆ గణేశ్ విగ్రహాం.. దేశంలోనే అత్యంత ఖ‌రీదైన‌ది..!

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఆగస్టు 27.. గణేశ్‌ చతుర్థి. ఈ సందర్భంగా గణపతి నవరాత్రి ఉత్సవాలకు యావత్‌ దేశం సిద్ధమవుతోంది. ఇప్పటికే విభిన్న ఆకృతుల్లో కొలువుదీరే వినాయకుల కోసం మండపాలు కూడా రెడీగా ఉన్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో గణేశ్‌ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంటారన్న విషయం తెలిసిందే.

ముంబై లోని ఓ గణేశుడు దేశంలోనే ధనిక గణేశ్‌ గా నిలిచిన విషయం తెలిసిందే. కింగ్స్‌ సర్కిల్‌లోని జీఎస్‌బీ సేవా మండల్‌ గణపతి కి ఈ పేరు దక్కింది. తాజాగా ఈ సంపన్న గణేశ్‌ ఫస్ట్‌లుక్‌ను నిర్వాహకులు ఇవాళ రివీజ్‌ చేశారు. ఈ విగ్రహాన్ని చూసి భక్తులు మంత్రముద్ధులయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

మతుంగా ప్రాంతంలో గత ఏడు దశాబ్దాలుగా జీఎస్‌బీ సేవామండల్‌ వినాయక చవితి వేడుకలను నిర్వహిస్తోంది. ఈసారి విఘ్నేశ్వరుడి మండపానికి ఏకంగా రూ.474.46 కోట్లకు బీమా చేయించటం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఇక్కడి విగ్రహాన్ని భారీ ఎత్తున బంగారం, వెండి ఆభరణాలతో అలంకరించనుండటమే అందుక్కారణం. ఈ ఏడాది 69 కేజీల బంగారు ఆభరణాలు, 336 కేజీల వెండి ఆభరణాలతో గణనాథుడిని అలంకరించనున్నారు. అందుకోసమే అంతమొత్తంలో బీమా చేయించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad