వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో విజయ్ పాల్ రెడ్డి అడిదల నిర్మించిన చిత్రం ‘త్రిబాణ ధారి బార్బరిక్’. మోహన్ శ్రీవత్స దర్శకుడు. సత్యరాజ్, వశిష్ట ఎన్ సింహా, ఉదయ భాను, సత్యం రాజేష్, క్రాంతి కిరణ్, సాంచీ రారు, మేఘన తదితరులు కీలక పాత్రలను పోషించారు.
ఈ మూవీని ఈనెల 29న విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా నటుడు వశిష్ట ఎన్ సింహా మీడియాతో పలు విశేషాలను షేర్ చేసుకున్నారు.
‘త్రిబాణధారి బార్బరిక్’ అనే టైటిల్ చెప్పినప్పుడు చాలా కొత్తగా అనిపించింది. ఈ పాత్ర గురించి బయట చాలా మందికి తెలియదు. టైటిల్ చెప్పిన వెంటనే కథను వినాలని అనిపిం చింది. దర్శకుడు మోహన్ నెరేషన్ చేసిన దాని కంటే విజువల్‌గా అద్భుతంగా వచ్చింది. ఈ కథ మన చుట్టూనే జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. ప్రతీ పాత్రతో అందరూ కనెక్ట్ అవుతారు.
ఇప్పటి వరకు నేను నెగెటివ్ రోల్స్ పోషించాను. కానీ ఇందులో నా క్యారెక్టర్ సరికొత్తగా ఉంటుంది. ఈ సమాజాన్ని ప్రతిబింబించేలా మా చిత్రం, నా పాత్ర ఉంటుంది. ఇందులోని స్క్రీన్ ప్లే చాలా కొత్తగా ఉంటుంది. మిడిల్ క్లాస్‌కు చెందిన ఓ అబ్బాయి పాత్రను పోషించాను. పెద్ద కలలతో ఉండే ఈ వ్యక్తి ఏం చేస్తాడు? అన్నది చాలా బాగా చూపించారు. ఈ కథలో నా ట్రాక్ చాలా కొత్తగా ఉంటుంది.
ఇందులోని ప్రతీ పాత్రకు బార్బరికుడి థీమ్‌కు లింక్ ఉంటుంది. త్రిబాణంలో ఎవరు ఏ బాణం అనేది సినిమా చూస్తేనే తెలుస్తుంది. ఈ చిత్రంలో బార్బరికుడు కనిపిం చడు.. అతని శక్తిని చూస్తారు. జవాబుదారితనం, బాధ్యతల గురించి ఈ చిత్రంలో చక్కగా చూపించారు. సత్య రాజ్, ఉదయ భాను.. ఇలా అన్ని క్యారెక్టర్స్ చక్కగా కుదిరాయి.
మా నిర్మాత విజరుపాల్ రెడ్డి ఎక్కడా రాజీపడకుండా నిర్మాణం చేశారు. ఇది తప్పకుండా మంచి విజయం సాధిస్తుంది. ఏ ఒక్కరినీ నిరాశపర్చదు.
ఏ ఒక్కరినీ నిరాశపర్చదు..
- Advertisement -
- Advertisement -