Wednesday, August 27, 2025
E-PAPER
spot_img
Homeసినిమాఒగ్గు కళాకారుల నేపథ్యంలో..

ఒగ్గు కళాకారుల నేపథ్యంలో..

- Advertisement -

ప్రస్తుతం తెలుగు ఫిల్మ్‌ ఇండిస్టీలో ఆధ్యాత్మిక కథలకు కూడా మంచి ఆదరణ లభిస్తుంది. ఒకవైపు పెద్ద సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఎలా అయితే గుర్తింపు తీసుకొస్తున్నాయో, మరోవైపు చిన్న సినిమాలు కూడా చాలామంది హదయాలను తాకుతున్నాయి. అలాంటి సినిమాలలో ‘బ్రహ్మాండ’ సినిమా ఒకటి. ఈ సినిమా నేడు (శుక్రవారం) రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్‌ నిర్వహించిన చిత్ర ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో నటి ఆమని మాట్లాడుతూ,’ఈ మూవీ తెలుగు ప్రేక్షకులకి ఓ కొత్త అనుభూతి అనుభూతిని ఇస్తుంది. ఇంత మంచి సినిమాను డైరెక్ట్‌ చేసిన రాంబాబు మన మధ్య లేకపోవడం బాధకారం. ఒగ్గు కళాకారుల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం అందర్నీ కచ్చితంగా అలరిస్తుందనే నమ్మకం ఉంది’ అని తెలిపారు.
హీరో బన్నీ రాజు మాట్లాడుతూ,’ఇందులో నాది అద్భుతమైన పాత్ర. ఈ సినిమా నా కెరీర్‌లో గుర్తుండిపోతుంది. అందరూ చూసి ఆదరించండి. ముఖ్యంగా క్లైమాక్స్‌ని మిస్‌ చేయకండి. అద్భుతమైన అనుభూతిని పొందుతారు’ అని అన్నారు. నిర్మాత దాసరి సురేష్‌ మాట్లాడుతూ,’స్క్రిప్ట్‌ దశలో మేము అనుకున్నది అనుకున్నట్టుగా .. అంతకుమించి చిత్రీకరించాం. మా డైరెక్టర్‌ ఇప్పుడు మా మధ్య లేకపోవడం బాధకరం. ఆమని, బలగం జయరాం, కొమురక్క సహకారం మేము మరవలేము’ అని చెప్పారు.
కనీకావాధ్వ చత్రపతి శేఖర్‌ అమిత్‌, దిల్‌ రమేష్‌ ప్రసన్నకుమార్‌ దేవిశ్రీ కర్తానందం తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి నిర్మాత : దాసరి సురేష్‌, సహ నిర్మాత : దాసరి మమత, కథ – స్క్రీన్‌ ప్లే – దర్శకత్వం :రాంబాబు, డైరెక్టర్‌ ఆఫ్‌ ఫోటోగ్రఫీ : కాసుల కార్తీక్‌, ఎడిటింగ్‌ : ఎమ్మార్‌ వర్మ, మాటలు : రమేష్‌ రాయి, జి ఎస్‌ నారాయణ .

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad