భారతీయ సినిమాలో సూపర్ హీరో తరహా చిత్రాలు రావడమే తక్కువే. అలాంటిది భారతదేశపు మొట్టమొదటి మహిళా సూపర్ హీరో చిత్రంగా ‘కొత్త లోక 1: చంద్ర’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్ర తెలుగు ట్రైలర్ తాజాగా విడుదలైంది. విడుదలైన తక్షణమే సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది.
కథానాయకుడు దుల్కర్ సల్మాన్‌కి చెందిన వేఫేరర్ ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించారు. భారతదేశపు మార్గదర్శక సూపర్ హీరోయిన్ చంద్రగా కళ్యాణి ప్రియదర్శన్ నటించిన ఈ చిత్రం భారతీయ సంస్కతి, జానపదాలు, పురాణాలలో పాతుకుపోయిన ఒక సాహసోపేతమైన కొత్త సినిమాటిక్ యూనివర్స్ తాలూకా ప్రారంభాన్ని సూచిస్తుంది. పురాణాలను ఆధునిక యాక్షన్‌తో మిళితం చేసిన దశ్యకావ్యంలా ఈ చిత్ర ట్రైలర్ ఉంది. మునుపెన్నడూ చూడని సరికొత్త అవతారంలో కళ్యాణి ప్రియదర్శన్ శక్తివంతంగా కనిపిస్తున్నారు. ఆమెతో పాటు, సన్నీగా నస్లెన్ కె.గఫూర్ మెప్పించారు. ఈనెల 29వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పంపిణీ చేస్తున్నారు.
భారత దేశపు తొలి మహిళాసూపర్ హీరో చిత్రం
- Advertisement -
- Advertisement -