Wednesday, August 27, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంసెల్ఫీ మరణాల్లో భారత్‌ టాప్‌

సెల్ఫీ మరణాల్లో భారత్‌ టాప్‌

- Advertisement -

న్యూఢిల్లీ : ప్రమాదకర ప్రదేశాలలో సెల్ఫీలు తీసుకుంటూ ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఇటీవలి కాలంలో పెరిగిపోతున్నాయి. సెల్ఫీల పిచ్చి మన దేశానికే పరిమితం కాలేదు.. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలోనూ ఈ ధోరణి కన్పిస్తోంది. సెల్ఫీ సంబంధిత మరణాలు, గాయాలు ఏ దేశంలో ఎక్కువగా చోటుచేసుకుంటు న్నాయన్న విషయంపై ఇటీవల ఓ సంస్థ అధ్యయనం నిర్వహించింది. దీని ప్రకారం భారత్‌ మొదటి స్థానంలో ఉండగా చైనా ద్వితీయ స్థానంలో నిలిచింది. 2014 మార్చి నుంచి ఈ ఏడాది మే వరకూ సెల్ఫీ సంబంధింత విషాద ఘటనలపై బార్బర్‌ లా సంస్థ అధ్యయనం జరిపింది. గూగుల్‌ న్యూస్‌లో ప్రచురితమైన నివేదికలను ఈ అధ్యయనం ఉపయోగించుకుంది. సెల్ఫీ తీసుకుంటూ చనిపోయిన వారు లేదా క్షతగాత్రులు అయిన వారి కేసులు ఇందులో ఉన్నాయి. ఈ అధ్యయనం ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా జరిగిన సెల్ఫీ సంబంధిత ఘటనల్లో భారత్‌ వాటా 42.1 శాతం. మన దేశంలో 271 సెల్ఫీ సంబంధమైన సంఘటనలు జరగగా వాటిలో 214 మంది చనిపోయారు. 57 మంది గాయాలపాలయ్యారు. రైల్వే పట్టాలు, ఎత్తయిన శిఖరాల వంటి ప్రమాదకరమైన ప్రదేశా లలో సెల్ఫీ ఘటనలు ఎక్కువగా నమోదవుతున్నాయి. బల మైన సోషల్‌ మీడియా సంస్కృతి, జన సమ్మర్దం అధికంగా ఉన్న ప్రదేశాలు కూడా ఇలాంటి సంఘటనలకు కారణమవుతు న్నాయి. ఇక అమెరికా విషయానికి వస్తే అక్కడ 45 ఘటనలు జరిగాయి. వాటిలో 37 మంది మర ణిస్తే ఎనిమిది మంది గాయపడ్డారు. కాగా 18 మరణాలతో రష్యా మూడో స్థానంలో నిలిచింది. సెల్ఫీ సంబంధమైన 16 మరణాలతో పాకిస్తాన్‌ నాలుగో స్థానంలోనూ, 13 మరణాలతో ఆస్ట్రే లియా ఐదో స్థానంలోనూ ఉన్నాయి. ఇండోనేషియా, కెన్యా, బ్రిటన్‌, స్పెయిన్‌, బ్రెజిల్‌ దేశాలలోని ప్రమాదకరమైన సెల్ఫీ పాయింట్ల కారణంగా కూడా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad