– మోడీపై మమత ధ్వజం
కొల్‌కతా : పశ్చిమ బెంగాల్ ప్రజలను దొంగలు అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంబోధించడాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా ఖండించారు. మోడీ ఆ విధంగా పిలిచి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి పదవిని, యావత్తు రాష్ట్ర ప్రజలను అగౌరవపరుస్తారని తానేప్పుడూ ఊహించలేదని మమతా అన్నారు. మంగళవారం బర్ధమాన్ పట్టణంలో జరిగిన ఒక కార్యక్రమంలో మమతా మాట్లాడుతూ ప్రధాని మోడీ వ్యాఖ్యలు పశ్చిమ బెంగాల్ ప్రజలకు ‘అవమానం’గా వర్ణించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మంజారు చేసిన నిధులను వెనక్కి తీసుకోవడంతో రాష్ట్ర ఖజానాపై భారీ భారం పడిందని తెలిపారు. తాను ప్రధానమంత్రిని పదవిని ఏవిధంగా గౌరవిస్తున్నానో.. ఆయన కూడా ముఖ్యమంత్రి పదవిని అదేవిధంగా గౌరవించాలని మమతా చెప్పారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ ‘వలస పక్షిలాగా’ మోడీ పశ్చిమ బెంగాల్‌కు వస్తారని విమర్శించారు. అలాగే, ‘కేంద్రం ప్రశ్నలన్నింటికీ మేము సమాధానం ఇచ్చాము. అయినప్పటికీ రాష్ట్రానికి నిధుల చెల్లింపును నిలిపివేసి పశ్చిమ బెంగాల్‌ను ‘దొంగ’ అని పిలుస్తారు. అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి కేంద్రం 186 బృందాలను పశ్చిమ బెంగాల్‌కు పంపారు. అయినా ఏమీ కనుగొనలేదు. అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన తర్వాత కూడా ఒక విద్యార్థి సున్నా మార్కులు రావడాన్ని ఎలా అంగీకరిస్తాడు? ఈ అవమానాన్ని మేము సహించం’ అని మమత పేర్కొన్నారు. ఈ నెల 22న కొలకతాలో జరిగిన ఒక బహిరంగ సభలో మోడీ మాట్లాడుతూ..’అవినీతి, నేరం టీఎంసీకి పర్యాయపదాలు’ అని అన్నారు. పశ్చిమ బెంగాల్‌కు ప్రభుత్వానికి పంపే నిధులను టీఎంసీ కార్యకర్తలు దోచుకుంటున్నారని ఆరోపించారు.
మమ్మల్ని దొంగలంటారా?
- Advertisement -
- Advertisement -