Wednesday, August 27, 2025
E-PAPER
spot_img
Homeఅంతర్జాతీయం29 నుంచి నాలుగు రోజుల పాటు జపాన్‌, చైనాల్లో మోడీ పర్యటన

29 నుంచి నాలుగు రోజుల పాటు జపాన్‌, చైనాల్లో మోడీ పర్యటన

- Advertisement -

న్యూఢిల్లీ : ఈ నెల 29 నుంచి నాలుగు రోజుల పాటు జపాన్‌, చైనాల్లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. ముందుగా ఈ నెల 29, 30 తేదీల్లో జపాన్‌లో మోడీ పర్యటిస్తారు. అక్కడ 15వ భారత్‌-జపాన్‌ వార్షిక సమావేశంలో మోడీ పాల్గొంటారు. జపాన్‌ ప్రధాని షిగెరు ఐషిబాతో సమావేశంలో పాల్గొంటారు. ప్రధాని మోడీకి ఇది ఎనిమిదో జపాన్‌ పర్యటన. ఈ పర్యటనలో జపాన్‌తో రక్షణ, భద్రత, వాణిజ్య, ఆర్ధిక, సాంకేతిక, పరిశోధన రంగాల్లో ప్రత్యేక వ్యూహాత్మాక భాగస్వామ్యంపై మోడీ చర్చించే అవకాశం ఉంది. జపాన్‌ నుంచి మోడీ నేరుగా చైనా పర్యటనలో పాల్గొంటారు. ఈ నెల 31, సెప్టెంబరు 1 తేదీల్లో చైనాలో మోడీ పర్యటన ఉంటుంది. అక్కడ జరిగే షాంఘై కోపరేషన్‌ ఆర్గనైజేషన్‌ (ఎస్‌సీఓ) సదస్సులో పాల్గొంటారు. ఈ సదస్సులో పాల్గొనే వివిధ దేశాధినేతలతో ద్వైపాక్షిక సమావేశాల్లోనూ మోడీ పాల్గొనే అవకాశం ఉంది. కాగా, మోడీ పర్యటనల గురించి కేంద విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ మంగళవారం విలేకరులకు వివరించారు. ఈ పర్యటన జపాన్‌, చైనాలతో భారత్‌ స్నేహాన్ని బలోపేతం చేస్తుందని, సహకారానికి కొత్త మార్గాలను తెరుస్తుందని అన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad