– మొన్న తమిళనాడు గవర్నర్, ఇపుడు బీజేపీ నేత అన్నామలై
– వీరి చేతులమీదుగా మెడల్ అందుకోవడానికి పలువురి నిరాకరణ
చెన్నై : తమిళనాడులో గవర్నర్ చేతుల మీదుగా పట్టా అందుకోవడానికి ఓ యువతి నిరాకరించిన విషయం మరువక ముందే మరో ఘటన చోటుచేసుకున్నది. తాజాగా బీజేపీ నేత అన్నామలై చేతుల మీదుగా మెడల్ అందుకోవడానికి ఓ ఆటగాడు నిరాకరించాడు. ఈ నెల 13న తిరునల్వేలిలో మనోన్మణియం సుందరనార్ విశ్వవిద్యాలయం 32వ స్నాతకోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి చాన్స్‌లర్ హౌదాలో హాజరైన గవర్నర్ ఆర్ ఎన్ రవి.. ఒక్కో విద్యార్థికి డిగ్రీ పట్టా అందజేశారు. ఎంబీఏ విద్యార్థిని జీన్ రాజన్ మాత్రం గవర్నర్ నుంచి పట్టా తీసుకోవడానికి నిరాకరించింది. పక్కన ఉన్న వర్సిటీ వీసీ నుంచి సర్టిఫికెట్ స్వీకరించిన విషయం తెలిసిందే. ఇటీవల 51వ రాష్ట్రస్థాయి షూటింగ్ గేమ్స్ జరిగాయి. ఇందులో తమిళనాడు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీఆర్‌బీ రాజన్ కుమారుడు సూర్య రాజ బాలు పతకం గెలుపొందారు. ఈ అవార్డుల ప్రదానోత్స కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కే. అన్నామలై ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు మెడల్స్ బహూకరించారు. అయితే ఆటగాడు సూర్య మెడలో అన్నామలై పతకం వేయబోతుండగా ఆయన పక్కకు తప్పుకున్నాడు. చేతితో దానిని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
నేను తీసుకోను..
- Advertisement -
- Advertisement -