Wednesday, August 27, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుహైద‌రాబాద్‌లో 9 రోజులు ట్రాఫిక్ ఆంక్ష‌లు

హైద‌రాబాద్‌లో 9 రోజులు ట్రాఫిక్ ఆంక్ష‌లు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: 9 రోజుల పాటు జ‌రిగే వినాయ‌క చ‌వితి ఉత్స‌వాల సంద‌ర్భంగా హైద‌రాబాద్ ట్రాఫిక్ యంత్రాంగం అప్ర‌మ‌త్త‌మైంది. సిటీలో ప్ర‌ధాన కూడ‌ల్లో ట్రాఫిక్ జాం కాకుండా పోలీసులు ప‌క‌డ్బందీగా చ‌ర్య‌లు తీసుకున్నారు. ప్ర‌ధానంగా ఖైరతాబాద్ గణేషుడి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇవాళ నుంచి (27 బుధవారం) సెప్టెంబర్ 6వరకూ ఇవి అమల్లో ఉండనున్నాయి.

డైవర్షన్‌లు ఇవే..

ఖైరతాబాద్ నుంచి మింట్ కాంపౌండ్ వైపు వచ్చే వాహనాలు.. నిరంకారి జంక్షన్ వైపు మళ్ళింపు

ఓల్డ్ సైఫాబాద్ పీఎస్‌ నుంచి రాజ్‌ దూత్ వైపు వచ్చే వాహనాలు ఇక్బాల్ మినార్ వైపు మళ్ళింపు

ఇక్బాల్ మినార్ నుంచి ఐమ్యాక్స్ వైపు వచ్చే వాహనాలు సెక్రటేరియట్ మీదుగా తెలుగుతల్లి జంక్షన్ వైపు మళ్లింపు

నెక్లెస్ రోటరీ నుంచి మింట్ కాంపౌండ్ వైపు వచ్చే వాహనాలు తెలుగుతల్లి జంక్షన్ , ఖైరతాబాద్ ఫ్లైఓవర్ మీదుగా మళ్ళింపు

ఖైరతాబాద్ పోస్ట్ఆఫీస్  నుంచి నిరంకారి నుంచి భవన్ వైపు వచ్చే వాహనాలు ఓల్డ్ సైఫాబాద్ పిఎస్‌ జంక్షన్ వైపు మళ్ళింపు
- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad