- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: తమిళనాడులోని కోయంబత్తూరు కలెక్టరేట్ కు మంగళవారం పంపిన బాంబు బెదిరింపు మెయిల్ నకిలీదని తేలింది. బాంబు బెదిరింపు మెయిల్ వచ్చిన వెంటనే పోలీసులు బాంబు గుర్తింపు, నిర్వీర్య దళం, స్నిఫర్ డాగ్స్ తో కలిసి కలెక్టరేట్ కాంప్లెక్స్ ను జల్లెడ పట్టారు. అన్ని భవనాలు, పార్కింగ్ ప్రాంతంలో తనిఖీలు జరిపారు. ఎటువంటి ఆధారాలు దొరకపోవడంతో బెదిరింపు మెయిల్ నకిలీదని తేల్చారు. ఈ-మెయిల్ పంపిన వారి గురించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -