Wednesday, August 27, 2025
E-PAPER
spot_img
Homeకరీంనగర్ఎగువ మానేరు వద్ద చిక్కుకున్న వారికి సహాయక చర్యలు: కలెక్టర్, ఎస్పీ

ఎగువ మానేరు వద్ద చిక్కుకున్న వారికి సహాయక చర్యలు: కలెక్టర్, ఎస్పీ

- Advertisement -

నవ తెలంగాణ-గంభీరావుపేట: గంభీరావుపేట మండలం ఎగువ మానేరు ప్రాజెక్టు వద్ద చిక్కుకున్న వారిని రక్షించేందుకు అన్ని సహాయక చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పి మహేష్ బి గితే తెలిపారు. నర్మాలలోని ఎగువ మానేరు ప్రాజెక్టు అవతలి వైపు పశువులను మేపేందుకు ఐదుగురు వెళ్లారు. ఇవతలి వైపు వచ్చేందుకు ప్రయత్నిస్తూ వారిలో ఒకరు గల్లంతు కాగా, మిగతా నలుగురు అక్కడే చిక్కుకుపోయారు. దీంతో కలెక్టర్ ఎస్పీ వెంటనే హుటాహటిన ప్రాజెక్ట్ వద్దకు చేరుకొని సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనాస్థలకి చేరుకొని చిక్కుకున్న వారికి ఆహారం, ఇతర సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad