నవతెలంగాణ – అశ్వారావుపేట
పెద్ద చదువుకు ఎంపికైన ఒక పేద విద్యార్ధిని కి ఆర్ధిక స్వచ్ఛంద సేవా సంస్థ చేయూత అందించింది. అశ్వారావుపేట పట్టణానికి చెందిన మానేపల్లి శ్యామ్ – క్రిష్ణ వేణి దంపతులు కూతురు ప్రీతికా ప్రిన్సెస్ ట్రిపుల్ ఐటీ బాసర సీటు సంపాదించింది.
దీంతో వాసవి క్లబ్ ఇంటర్ నేషనల్ “సరస్వతి” విభాగంలో సంస్థ ప్రెసిడెంట్ డైమండ్ స్టార్ ఇరుకుళ్ళ రామకృష్ణ, డిస్ట్రిక్ట్ వి 106 ఏ గవర్నర్,సిల్వర్ స్టార్ కొత్త వెంకటేశ్వర్లు ఆదేశానుసారం బుధవారం రూ.5000 లు వాసవి క్లబ్ కేసీజీఎఫ్,వీఎన్ సత్యవరపు బాలగంగాధర్ సమక్షంలో బుధవారం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో వాసవి దేవాలయంలో విద్యార్ధిని తల్లిదండ్రులకు చెక్కును అందించారు.
ఈ కార్యక్రమంలో రీజనల్ చైర్మన్ వీఎన్ కేసీజీఎఫ్ బోగవల్లి రాంబాబు,పూర్వ అద్యక్షులు జల్లిపల్లి దేవరాజు, ఆర్యవైశ్య పట్టణ అద్యక్షులు జల్లిపల్లి లోక నాథ్ గుప్తా, పసుమర్తి వైకుంఠం, కర్పూరపు స్వామి, జై వరపు సర్వేశ్వరరావు, వాగు శ్రీనివాసరావు, కాకి సతీష్, తడికమల్ల సురేష్, సీమకుర్తి మల్లికార్జునరావు, యశోద సందీప్, రావి క్రింది కుమార్ రాజా, సమయమంతుల మోహన గంగాధర్ రావు, అచ్యుత, సత్యమూర్తి పాల్గొన్నారు.