నవతెలంగాణ-జుక్కల్ : మండలంలోని సాగర్ గావ్ గ్రామ పరిధిలో ఉన్న ప్రాజెక్టు కౌలాస్ నాలా ప్రాజెక్ట్ నుండి గురువారం నాడు ఏడు గేట్లు ఎత్తివేసి దిగువన ప్రాజెక్ట్ అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 458 మీటర్లు కాగా ప్రస్తుతం 457. 65 మీటర్లు ఉంది. ప్రాజెక్టు నీటి కెపాసిటీ 1.237 ఈఎంసీలు. దిగువన మరియు జుక్కల్ ప్రాంతంలో భారీ వర్షాలు పడుతున్నాడంటూ ఇన్ ఫ్లో 22 వేల 820 క్యూసెక్కులు మీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుందని అధికారులు తెలిపారు. రమ ప్రాజెక్టు 7 గేట్లు ఎత్తివేసి దిగువకు వరద కాలువ ద్వారా 36 వేల 1వంద 53 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు . అవుట్ ఫ్లో ప్రధాన కాలువ ద్వారా ఎటువంటి నీటిని విడుదల చేయడం లేదని ఒక ప్రకటనలో ప్రాజెక్ట్ నీటిపారుదల శాఖ అధికారులు తెలియజేశారు.
కౌలాస్ నాళా ప్రాజెక్టు ఏడు గేట్లు ఎత్తివేత..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES