– ఆసుపత్రిని పరిశీలించిన తహశీల్దార్
నవతెలంగాణ-ముధోల్ : నియోజవర్గ కేంద్రమైన ముధోల్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో వర్షంతో గురువారం మందులు తడిసిపోయాయి. బుధవారం రాత్రి నుండి కురుస్తున్న వర్షంతో ముందే శిధిలావస్థలో ఉన్న ఆస్పత్రి భవనం ఊరటంతో ఆస్పత్రిలో ఉన్న మందులు తడిసిపోయాయి. గురువారం వర్షం భారీగా కురవడంతో కూడా మరింత ఆసుపత్రి భవనం వర్షపు నీరుతో లోపలతడిసిపోయింది. రోగుల కోసం ఇచ్చే మందులు కూడా వర్షంతో తడిసిపోయాయి. వర్షం తో ఆసుపత్రి ఊరడంతో విధులో ఉన్న వైధ్య సిబ్బంది కూడా ఇబ్బందులు ఎదుర్కొంన్నారు.ఈ విషయం తెలుసుకోని హుటాహుటిన తహశీల్దార్ శ్రీలత ఆసుపత్రిని సందర్శించారు. తడిచిన మందులను పరిశీలించారు. రోగులకు ఇబ్బందులు కలగకుండా సేవలందించాలని సూచించారు. మందులు తడిసిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు . ఈమె వెంట నాయబ్ తహశీల్దార్ తెలంగ్ రావ్,ఆర్ ఐ నారాయణరావు పటేల్, ఉన్నారు.
ముధోల్ ఆస్పత్రిలో వర్షంతో తడిసిన మందులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES