నవతెలంగాణ మద్నూర్
మంజీరా నది ఉదృతంగా ప్రవహిస్తుండటంతో జుక్కల్ నియోజకవర్గంలోని మంజీరా నదికి పరిసర ప్రాంతంలో ఉన్న డోంగ్లి మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు పర్యటించారు. కుర్లా, మాదన్ఇప్పర్గా, సిర్పూర్, ఇటు లేండి వాగు పరిసర గ్రామాలైన పెద్ద టాక్లి, చిన్న టాక్లి, తదితర గ్రామాల ప్రజల సాధక బాధకాలు తెలుసుకున్నారు.
ఈసందర్భంగా ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు మాట్లాడుతూ పగలైనా రాత్రైనా ప్రజాసేవలో నేనుంటానంటూ బుధవారం అర్ధరాత్రి సమయంలో డోంగ్లి మండలాన్ని సందర్శించారు. మంజీరా నది పరివాహక గ్రామాల ప్రజల పరిస్థితులను సమీక్షించారు అవసరమైతే కొంతమంది నీ కాలి చేయించి డోంగ్లి మండల కేంద్రంలో నివాసాలు ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశించారు ఎమ్మెల్యే వెంట డోంగ్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు రెవెన్యూ శాఖ అధికారులు ముఖ్యంగా ఆర్ఐ సాయిబాబా ఎమ్మెల్యే పర్యవేక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు.