- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : రాజన్న సిరిసిల్ల జిల్లా నర్మాలలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. నర్మాలలో వరద బాధితులను పరామర్శించి వస్తుండగా కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎదురుపడ్డారు. బండి సంజయ్‌ను చూడగానే ఆయన కాన్వాయ్ వద్దకు కేటీఆర్ వచ్చారు. వాహనం దిగి కేటీఆర్ వద్దకు వచ్చిన బండి సంజయ్ అభివాదం చేశారు. బాగున్నారా అంటూ ఒకరికొకరు పలుకరించుకున్నారు. కష్టపడుతున్నవంటూ ఈ సందర్భంగా బండి సంజయ్‌ను ఉద్దేశించి కేటీఆర్ వ్యాఖ్యానించారు. అనంతరం నర్మాల బాధితులను పరామర్శించేందుకు కేటీఆర్ వెళ్లిపోయారు.
- Advertisement -