– సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకట్ గౌడ్
నవతెలంగాణ – కామారెడ్డి
ఇంకా వర్షాలు రెండు, మూడు రోజులు వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నందున కామారెడ్డి జిల్లా ప్రజలందరూ అలాగే పట్టణ కేంద్రంలోని హౌసింగ్ బోర్డ్, ద్వారక నగర్, బృందావన్ కాలనీ, జి ఆర్ కాలనీ, కౌండిన్య కాలనీ, బతుకమ్మ కుంట, గాంధీ నగర్ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కార్యదర్శి తందూరి చంద్రశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండు రోజుల నుండి మరో రెండు రోజుల వరకు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున సీపీఐ(ఎం) కార్యకర్తలు, కాస్త చైతన్యం కలిగిన యువత అత్యవసరంగా క్షేత్రస్థాయికి చేరుకొని సేవా కార్యక్రమాలు చేపట్టి బాధితులకు సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు.
దీనిని మానవసేవయే మాధవసేవగా భావించి తమ తమ వంతు సహాయ సహకారాలను ప్రజలకు అందించాలని సందర్భంగా కోరుతున్నాం అన్నారు. వరద బాధితులకు సహాయ సహకారాలు అందించండి. సీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకట్ గౌడ్ గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలకు నష్టపోయిన, వరదల్లో ఇబ్బంది పడిన ప్రజలకు ప్రభుత్వం వెంటనే సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నామనీ సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకట గౌడ్ తెలిపారు. అలాగే సిపిఎం పార్టీ నుండి నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరము వరద బాధితులకు మనకు చైతన్య సహాయాన్ని అందించాలని ఈ ఓ సందర్భంగా కోరుతున్నామన్నారు.