– స్పందించిన బీఆర్ఎస్ నాయకులు
నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే భారీ వర్షంతో ఎక్కడైనా నీటి ప్రవాహం ఎక్కువై వరద వచ్చినా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని బీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా సిద్ధాపూర్ చెరువు పగిలి పోయి ప్రమాదం పొంచి ఉందని అవకాశం ఉండడంతో వెంటనే జుక్కల్ ఎస్సై, ఎమ్మార్వో, ఎంపీడీవో అధికారులకు సమాచారం అందించారు. అధికారులు వెంటనే సిద్ధపూర్ చెరువు కట్టను పరిశీలించేందుకు వచ్చారు. సమస్య తీవ్రమైతుందని గ్రహించిన అధికారులు యంత్రం సాయంతో పరిష్కరించినారు. అధికారులకు సాయంగా మాజీ ఎంపీటీసీ విట్టల్ రావు పాటిల్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
గ్రామ ప్రజలు భయఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని ఎమ్మార్వో , ఎంపీడీవో తెలిపారు. బీఅర్ఎస్ పార్టీ ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటుంది అని భరోసా ఇచ్చారు. ఈ సహాయకార్యక్రమాలలో రెవెన్యూ అధికారులు సిబ్బంది, ఎంపీడీవో శ్రీనివాస్, ఎస్సై నవీన్ చంద్ర, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.