నవతెలంగాణ-హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతితోపాటు పలువురు గాయపడటానికి కారణమైన టీవీ నటుడు ఖయూమ్ అలియాస్ లోబోకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ గురువారం జనగామ కోర్టు తీర్పునిచ్చింది. జనగామ జిల్లా రఘునాథపల్లి సీఐ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్సై నరేష్‌ల కథనం ప్రకారం.. 2018 మే 21న ఓ టీవీ ఛానల్ తరఫున వీడియో చిత్రీకరణ కోసం లోబో బృందం రామప్ప, లక్నవరం, భద్రకాళి చెరువు, వేయిస్తంభాల ఆలయం తదితర ప్రాంతాల్లో పర్యటించింది. అనంతరం లోబో స్వయంగా కారు నడుపుతూ వరంగల్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా.. రఘునాథపల్లి మండలం నిడిగొండ వద్ద ఎదురుగా వచ్చిన ఆటోను ఢీకొట్టారు. ఆటోలో ప్రయాణిస్తున్న ఖిలాషాపురం గ్రామానికి చెందిన మేడె కుమార్, పెంబర్తి మణెమ్మలు తీవ్ర గాయాలతో మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. కారు కూడా బోల్తా పడటంతో లోబోతో పాటు బృంద సభ్యులకు స్వల్ప గాయాలయ్యాయి. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అప్పట్లో రఘునాథపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరి మృతికి కారణమైన లోబోకు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.12,500 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చినట్లు పోలీసులు వివరించారు.
కమెడియన్ లోబోకు ఏడాది జైలు శిక్ష..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES