- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: భారీ వర్షాలతో నిర్మల్ జిల్లాలోని గడ్డెన్న వాగు ప్రాజెక్టుకు భారీగా వరద వస్తున్నది. దీంతో మూడు గేట్లు ఎత్తి 20,500 క్యూసెక్కుల దిగువకు విడుదల చేస్తున్నారు. గడ్డెన్న వాగు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 358.70 మీటర్లు. ప్రస్తుతం 358.55 మీటర్ల వద్ద నీటిమట్టం ఉన్నది. ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో వాగు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
- Advertisement -