నవతెలంగాణ-హైదరాబాద్ : ఎఫ్-16 యుద్ధ విమానం కుప్పకూలి ఆర్మీ పైలట్ అక్కడిక్కడే కాలిబూడిదై ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన పోలాండ్ దేశంలోని రాడోమ్‌లో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాడోమ్ ఎయిర్ షోలో పోలిష్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఎఫ్-16 ఫైటర్ ఒక్కసారిగా అదుపుతప్పి కూలిపోయింది. జెట్ అతివేగంతో నేలను తాకగానే అందులో ఉన్న ఫ్యూయల్ బయటకు రావడంతో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఆర్మీ పైలట్ మృతి చెందారు. ప్రభుత్వ ప్రతినిధి ఆడమ్ ష్లాప్కా, రక్షణ మంత్రి వ్లాడిస్లావ్ కోసినియాక్-కమిష్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా పైలట్ మరణాన్ని కూడా ధృవీకరించారు. ఈ మేరకు కోసినియాక్-కమిష్ సంఘటనా స్థలాన్ని సందర్శించి పైలట్ అంకితభావం ధైర్యాన్ని కొనియాడుతూ.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. అయితే, ఈ దుర్ఘటనలో వీకెండ్‌లో జరగాల్సిన రాడోమ్ ఎయిర్ షోను రద్దు చేస్తున్నట్లుగా అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. పోలిష్ ఎయిర్‌ఫోర్స్ చరిత్రలోనే ఇది అతి పెద్ద దుర్ఘటన అని వెల్లడించింది.
కూలిన యుద్ధ విమానం..కాలిబూడిదైన పైలట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES