నవతెలంగాణ -సుల్తాన్ బజార్ : సీపీఎస్ విధానాన్ని రద్దుచేసి 1980 రివైజ్డ్ పెన్షన్ రూల్స్ ప్రకారం పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతూ సెప్టెంబర్ 1న తెలంగాణ ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ వి లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించనున్న పాత పింఛన్ సాధన లక్ష్యంగా ఉద్యోగుల ఉపాధ్యాయ చైతన్య యాత్రకు, ఉద్యోగుల ఆత్మగౌరవ సభ కు మద్దతు ప్రకటిస్తున్నామని తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని రాష్ట్ర అధ్యక్షులు రాబర్ట్ బ్రూస్ అన్నారు.గురువారం కోఠి లోని డి ఎం హెచ్ ఎస్ క్యాంపస్ ఆవరణలో లోని రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సిపిఎస్ ఉద్యోగ సంఘం సెప్టెంబర్ 1న ఆర్టీసీ కళాభవన్ లో నిర్వహిస్తున్న సిపిఎస్ ఉద్యోగుల ఆత్మగౌరవ సభకు తమ యూనియన్ మద్దతు ప్రకటిస్తున్నామన్నారు.పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాలలో ఉన్న ఉద్యోగులందరూ ఈ సభకు రావాలని పిలుపునిచ్చారు.
ఉద్యోగుల ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలి…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES