Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుమూడు ల‌క్ష‌ల మందికి ఈసీ నోటీసులు..ఏడు రోజులు గ‌డువు

మూడు ల‌క్ష‌ల మందికి ఈసీ నోటీసులు..ఏడు రోజులు గ‌డువు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌:

ఈ ఏడాది చివ‌ర‌లో బీహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఈసీ ఎస్ఐఆర్ పేరుతో స‌మ‌గ్ర ఓట‌ర్ జాబితాను రూపొందించిన విష‌యం తెలిసిందే.ఈ ప్రక్రియ‌పై విప‌క్షాలు మండిప‌డుతున్నాయి. ఎస్ఐఆర్ పేరుతో బీజేపీతో క‌లిసి ఈసీ ఓట్ల చోరీకి పాల్ప‌డుతుంద‌ని ప్ర‌తిప‌క్ష‌నేత రాహుల్ గాంధీ ఓట‌ర్ అధికార్ యాత్ర‌ను కూడా బీహార్ లో ప్రారంభించిన విష‌యం తెలిసిందే. ఈక్ర‌మంలో ఈసీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఎస్ఐఆర్ ప్ర‌క్రియ‌లో భాగంగా త‌ప్పుడు ప‌త్రాలు స‌మ‌ర్పించిన మూడు ల‌క్ష‌ల మందికి ఎన్నిక‌ల సంఘం నోటీసులు జారీ చేసింది.

వారి పత్రాలలో వ్యత్యాసాలు ఎందుకు ఉన్నాయో వివరించేందుకు వారికి ఈసీఐ ఏడు రోజులు గడువు ఇచ్చింది. ‘మూడు లక్షల మంది ఎస్‌ఐఆర్‌ ప్రకారం ముసాయిదా ఓటర్ల జాబితాలో తమ పేరు నమోదు చేసుకున్నారు. అయితే వారి పత్రాల పరిశీలనలో వ్యత్యాసాలు కనిపించాయి. దీంతో క్షేత్ర స్థాయిలో తనిఖీలు జరిగాయి. ఫలితంగా వీరు బంగ్లాదేశ్, మయన్మార్ లేదా నేపాల్ నుండి వచ్చి ఉండవచ్చనే అనుమానాలు నెలకొన్నాయని అని ఒక అధికారి మీడియాకు తెలిపారు.

ఈసీ నోటీసులు పంపి, వివరణ కోరిన ఓటర్లలో అత్యధికులు తూర్పు చంపారణ్‌, పశ్చిమ చంపారణ్‌, మధుబని, కిషన్‌గంజ్, పూర్ణియా, కతిహార్, అరారియా సుపాల్ జిల్లాలకు చెందినవారున్నారు. ఈసీఐ భారీ సంఖ్యలో ఓటర్లకు నోటీసులు జారీ చేసిన దరిమిలా, బీజేపీ దీనిపై స్పందిస్తూ, ఈ ప్రాంతం బంగ్లాదేశీయులు, రోహింగ్యాల అక్రమ వలసలకు కేంద్రంగా ఉందని ఆరోపించింది. కాగా ఎన్నికల జాబితాపై కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్‌)పై వివిధ రాజకీయ పార్టీలు అభ్యంతరాలను వ్యక్తం చేశాయి.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad