Tuesday, May 6, 2025
Homeఅంతర్జాతీయంమొత్తంగా ఆక్రమించుకుందాం

మొత్తంగా ఆక్రమించుకుందాం

- Advertisement -

– నిరవధికంగా తిష్ట వేద్దాం
– గాజాపై కొత్త ప్రణాళికకు ఇజ్రాయిల్‌ క్యాబినెట్‌ పచ్చజెండా
టెల్‌ అవీవ్‌:
గాజా కొత్త ప్రణాళికకు సోమవారం ఇజ్రాయిల్‌ కేబినెట్‌ పచ్చ జెండా వూపింది. గాజా ప్రాంతాన్ని మొత్తంగా ఆక్రమించేసుకోవడానికి, ఎంత కాలమైనా అక్కడే తిష్ట వేయడానికి మంత్రులందరూ ఆమోద ముద్ర వేశారని ఇజ్రాయిల్‌ అధికారులు తెలిపారు. ఈ ప్రణాళికను అమలు చేసినట్లైతే పాలస్తీనా భూభాగంలో ఇజ్రాయిల్‌ తన సైనిక కార్యకలాపాలను అపారంగా విస్తరిస్తుంది. దీనికి అంతర్జాతీ యంగా కూడా తీవ్ర ప్రతిఘటన ఎదురయ్యే అవకాశాలు వున్నాయి. సోమవారం ఉదయమే జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రణాళికకు మంత్రులందరూ ఆమోద ముద్ర వేశారు. అంతకు కొద్ది గంటలు ముందే వేలాదిగా రిజర్వ్‌ సైనికులను హాజరు కావాల్సిందిగా ఆర్మీ పిలుపిచ్చినట్టు ఇజ్రాయిల్‌ మిలటరీ చీఫ్‌ తెలిపారు. హమాస్‌ను ఓడించి, గాజాలోని బందీలందరినీ విడిపించాలన్నది ఇజ్రాయిల్‌ యుద్ధ లక్ష్యాలుగా వున్నాయి. కొత్త ప్రణాళికను అమలు చేయడం వల్ల వందలు వేల సంఖ్యలో పాలస్తీనియన్లను దక్షిణ గాజాకు తరలిస్తారు. దీనివల్ల ఇప్పటికే తీవ్రంగా వున్న మానవతా సంక్షోభం మరింత పెచ్చరిల్లే ప్రమాద ముందని భావిస్తున్నారు.
సాయానికి కొత్త ప్లాన్‌
మార్చి మధ్యలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఇజ్రాయిల్‌ భీకరంగా దాడులకు తెగబడింది. దాదాపు 50శాతం భూభాగాన్ని తన స్వాధీనం లోకి తెచ్చుకుంది. గాజాలోకి మానవతా సాయాన్ని రాకుండా నిలిపివేసింది. మానవతా సాయాన్ని అందిస్తుంటే గాజాలో హమాస్‌ పట్టు ఇంకా కొనసాగుతునే వుంటుందని, అదే హమాస్‌ కాకుండా ప్రయివేట్‌ సెక్యూరిటీ కంపెనీలను ఉపయోగించి మానవతా సాయాన్ని పంపిణీ చేయిస్తే ప్రజల్లో పట్టు తగ్గుతుందని భావిస్తున్నట్టు ఇజ్రాయిల్‌ అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించి సమాచారాన్ని ఐక్యరాజ్య సమితికి ఇజ్రాయిల్‌ తెలియచేసిందని క్యాబినెట్‌ ఇంటర్నల్‌ మెమో తెలిపింది. గాజాలో ఆహార సమన్వయ వ్యవహా రాలు చూసే ఇజ్రాయిల్‌ రక్షణ సంస్థ ఇన్‌చార్జి, ఐక్యరాజ్య సమితి అధికారుల మధ్య జరిగిన సమావేశపు వివరాలను తెలియచేస్తూ ఆదివారం సహాయ సంస్థ లకు ఒక మెమో కూడా పంపారు. అయితే ఈ సాయం ఎప్పుడు అందచేస్తారు, ఎలా అందుతుందనే వివరాలను ఆ మెమోలో పేర్కొనలేదు. గాజాలో తమ ప్రణాళికను నెమ్మదిగా అమలు చేయడమే ఇజ్రాయిల్‌ లక్ష్యమని స్పష్టం చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -