Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంఅక్టోబర్‌-నవంబర్‌ల్లో ముందస్తు జనగణన

అక్టోబర్‌-నవంబర్‌ల్లో ముందస్తు జనగణన

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: 2027లో చేపట్టనున్న జనగణన కోసం ముందస్తు సర్వే ఈ ఏడాది అక్టోబర్‌ -నవంబర్‌ల మధ్య నిర్వహించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు పలు రాష్ట్రాల్లోని సెన్సస్‌ ఆపరేషన్స్‌ డైరెక్టరేట్‌లకు (డిసిఒ) రిజిస్ట్రార్‌ జనరల్‌ మరియు సెన్సెస్‌ కమిషనర్‌ (ఆర్‌జి అండ్‌ సిసిఐ) శుక్రవారం పలు సూచనలు జారీ చేశారు.

ఏప్రిల్‌ 1,2026 మరియు ఫిబ్రవరి 28,2027 మధ్య రెండు దశల్లో నిర్వహించనున్న జనగణనకు సంబంధించి ముందస్తు సర్వే అవసరమని పేర్కొన్నారు. ఇది భారత్‌ చేపట్టనున్న మొదటి డిజిటల్‌ జనగణన మరియు కులగణనలో మొదటిది కావడం గమనార్హం.

ముందస్తు సర్వేలో భాగంగా ప్రజలను అడగాల్సిన ప్రశ్నలు, డేటా సేకరణ పద్ధతులు, శిక్షణ సామర్థ్యం, లెక్కలు, ఇతర వివరాలు, ప్రింటింగ్‌ ప్రక్రియలు మరియు సమాచార నాణ్యతను మూల్యాంకనం చేస్తుందని భారత రిజిస్ట్రార్‌ జనరల్‌ మృత్యుంజయ్ కుమార్‌ నారాయణ్‌ తెలిపారు. జనగణన ప్రక్రియలో ఎదురయ్యే సమస్యలను కూడా గుర్తించవచ్చని అన్నారు. డేటాను సేకరించడానికి మొదటిసారిగా మొబైల్‌ యాప్‌ను వినియోగించనున్నామని, స్వీయ గణన, డిజిటల్‌ మ్యాపింగ్‌ సాధనాలు, రియల్‌ టైమ్‌ పర్యవేక్షణ మరియు నిర్వహణ కోసం వెబ్‌ ఆధారిత పోర్టల్‌ వంటి ఇతర అంశాలను కూడా జనగణన ముందస్తు సర్వేలో చేపట్టనున్నట్లు పలు రాష్ట్రాల డిసిఒలకు తెలిపారు.

చివరిసారిగా జనగణనను 2011లో చేపట్టారు. సాధారణంగా పదేళ్ల కొకసారి జనగణన నిర్వహించాల్సి వుంది. అయితే 2021లో కొవిడ్‌ మహమ్మారి కారణంగా ఈ ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది. ఇది ప్రస్తుతం 2027కి పూర్తి కానుంది.
ప్రణాళిక ప్రకారం.. 2021జనగణనకు సంబంధించి ముందస్తు వ్యాయామం 2019లో చేపట్టినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 76 జిల్లాల్లో 26 లక్షలకు పైగా ప్రజలను ఇందులో చేర్చారని పేర్కొన్నాయి. 2019లో రాష్ట్ర ప్రభుత్వాల నుండి సుమారు 6,000 మంది గణనదారులు, 1100 మంది పర్యవేక్షకులు పాల్గొన్నారని ఆ వర్గాలు వెల్లడించాయి.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad