Sunday, August 31, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంరంబన్‌లో క్లౌడ్‌ బరస్ట్‌: న‌లుగురు మృతి..ఒక‌రు గ‌ల్లంతు

రంబన్‌లో క్లౌడ్‌ బరస్ట్‌: న‌లుగురు మృతి..ఒక‌రు గ‌ల్లంతు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఉత్త‌ర భార‌త్‌ను వ‌ర‌స‌ మేఘ‌ విస్పోట‌నాలు క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఉత్త‌రాఖండ్ రాష్ట్రంలోని ధార‌వి గ్రామాన్ని క్లౌడ్ బ‌ర‌స్ట్ క‌బ‌ళిలించిన సంఘ‌ట‌న మ‌రువ‌క ముందే.. జ‌మ్మూక‌శ్మీర్ లో వ‌రుస‌గా రెండు క్లౌడ్ బ‌ర‌స్ట్ లు హ‌డ‌లెత్తించాయి. తాజాగా రంబన్‌లో క్లౌడ్‌ బరస్ట్‌ కారణంగా న‌లుగురు చ‌నిపోయారు. మ‌రొక‌రు గ‌ల్లంతు అయ్యారు.

భారీ వర్షాలు సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగిస్తున్నాయి. అయినప్పటికీ రెస్క్యూ సిబ్బంది బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. క్లౌడ్‌ బరస్ట్‌ కారణంగా అకస్మాత్తుగా వచ్చిన వరదలతో పలు ఇళ్లు జలమయమయ్యాయి. కల్వర్టులు, రోడ్లు ధ్వంసమయ్యాయి. వాతావరణ శాఖ భారీ వర్ష సూచనకు సంబంధించిన హెచ్చరిక జారీ చేసింది.

ఆగస్టు 14న చిసోటిలో క్లౌడ్‌ బరస్ట్‌ కారణంగా సంభవించిన విపత్తులకు 65 మంది మృతిచెందారు. వీరిలో అధిక సంఖ్యలో పర్యాటకులున్నారు. ఈ ఘటనల్లో 100 మందికి పైగా ప్రజలు గాయపడ్డారు. ఇదేవిధంగా కథువా జిల్లాలో ఆకస్మిక వరదకు ఐదుగురు పిల్లలతో సహా ఏడుగురు మృతి చెందారు.

మంగళవారం రియాసి జిల్లాలోని వైష్ణో దేవి మార్గంలో కొండచరియలు విరిగిపడి, 34 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోగా, 20 మంది గాయపడ్డారు. ఆకస్మిక వరదల తరువాత పరిస్థితిని సమీక్షించేందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆగస్టు 24న జమ్మూను సందర్శించారు

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad