నవతెలంగాణ-హైదరాబాద్: త్వరలో జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రిగ్గింగ్ పాల్పడకుండా..ఇండియా బ్లాక్ కూటమి పోరాటం చేస్తుందని ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ అన్నారు. ఎస్ఐఆర్ పేరుతో ఈసీ ఓట్ల చోరీ ఉదంతాన్ని ప్రజలకు తెలియజేయడానికి ఆయన ఓటర్ అధికార్ యాత్రకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ యాత్ర భోజ్‌పూర్ పరిధిలో కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాళ్లు మహారాష్ట్ర ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని, హర్యానాలో అదే పని చేశారని, ఎంపీ ఎలక్షన్స్ కూడా ఓట్ల చోరీకి తెరలేపారని ఆరోపించారు. కానీ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల చోరీ తెరలేపారని, కానీ దాని మేము అడ్డుకుంటున్నామన్నారు.
అదే విధంగా తేజిస్వీ యాదవ్ మాట్లాడుతూ.. ఓటర్ అధికార్ యాత్రను చూసి బీజేపీ నేతలు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ యాత్రతో రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం డీలాపడిపోయిందని సెటైర్లు వేశారు. వారు చేయగలిగినదంతా చేస్తున్నారు, మేము వాళ్లు చేసే ప్రతి పని మీద నిశితంగా దృష్టి సారిస్తున్నాము. వారు ఎంత ప్రయత్నించినా, వారు బీహార్‌లో తిరిగి అధికారంలోకి రాలేరు” అని యాదవ్ మీడియా సమావేశంలో అన్నారు.
రాహుల్ గాంధీ చేపట్టిన ఓటరు అధికార్ యాత్ర 20 జిల్లాల్లో 1,300 కి.మీ.లకు పైగా ప్రయాణించి సెప్టెంబర్ 1న పాట్నాలో ముగుస్తుంది. పలు రోజుల నుంచి కొనసాగుతున్న యాత్రకు రోజురోజుకు ప్రజాదరణ పెరిగిపోతుంది. యాత్ర కొనసాగుతన్న ఆయా ప్రాంతాల ప్రజలు రాహుల్‌కు బ్రహ్మరథం పడుతున్నారు.