Tuesday, May 6, 2025
Homeఅంతర్జాతీయంభద్రతా మండలిలో పాకిస్థాన్‌కు ఎదురుదెబ్బ‌..

భద్రతా మండలిలో పాకిస్థాన్‌కు ఎదురుదెబ్బ‌..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: పెహల్గామ్‌ ఉగ్రదాడి ఘటన అంశాన్ని నేడు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో లేవనెత్తింది. పాకిస్థాన్‌ చేస్తున్న వాదనలను కొట్టివేస్తూ భద్రతా మండలి సభ్యులు కొన్ని ప్రశ్నలు వేశారు. బైసారన్‌లో జరిగిన నరమేధం వెనుక లష్కరే తోయిబా ఉగ్ర సంస్థ హస్తం ఉందా ? లేదా ? అన్న ప్రశ్న వేశారు. ఈ అంశంలో పాకిస్థాన్‌ను యూఎన్‌ భద్రతా మండలి సభ్యదేశాలు గట్టిగా నిలదీశాయి. పెహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద ఘటనను అన్ని దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఆ ఘటన పట్ల బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని యూఎన్‌ చెప్పింది. మతం పేరిట పర్యాటకులను టార్గెట్‌ చేయడాన్ని భద్రతా మండలి సభ్యులు తీవ్రంగా ఖండించారు. పాకిస్థాన్‌ చేపడుతున్న క్షిపణి పరీక్షలను కూడా యూఎస్‌ సభ్య దేశాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇలాంటి సమయంలో అణ్వాయుధ క్షిపణి పరీక్షలు చేయడంలో ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను ఎందుకు పెంచుతున్నట్లు అని పాకిస్థాన్‌ను అడిగారు. పెహల్గామ్‌ దాడి ఘటనలో తమను నిందిస్తున్నట్లు పాకిస్థాన్‌ చేస్తున్న వాదలను యూఎన్‌ సభ్య దేశాలు కొట్టిపారేశాయి. భారత్‌తో సమస్యను ద్వైపాక్షికంగా పరిష్కరించుకోవాలని కొన్ని దేశాలు పాకిస్థాన్‌కు సూచించాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -