- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ లో మరోసారి హైడ్రా కూల్చివేతలు మొదలయ్యాయి. ఈసారి గచ్చిబౌలిలోని అక్రమ కట్టడాలపై అధికారులు గురిపెట్టారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి కట్టిన భారీ భవనాలను నేలమట్టం చేస్తున్నారు. మంగళవారం ఉదయాన్నే గచ్చిబౌలి చేరుకున్న అధికారులు.. సంధ్య కన్వెన్షన్ లో అక్రమంగా నిర్మించిన మినీ హాల్ ను కూల్చివేశారు. ఫుడ్ కోర్టును కూడా తొలగించారు. మూడు భారీ బుల్డోజర్లతో గచ్చిబౌలిలో కూల్చివేతలు జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు. కూల్చివేతలపై ఆందోళన చేస్తున్న వారిని అదుపు చేయడానికి పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.
- Advertisement -