నవతెలంగాణ-హైదరాబాద్: ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు మద్దతుగా అన్నివిధాలా సహకారమందిస్తామని యుఎస్ హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక కాలమానం ప్రకారం కాపిటల్ హిల్‌లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో మైక్ జాన్సన్ మాట్లాడారు. భారత్‌లో జరుగుతున్న పరిణామాల పట్ల సానుభూతి ఉందని అన్నారు. తాము మిత్రదేశాలకు మద్దతుగా ఉండాలని కోరుకుంటున్నామని, భారతదేశం అనేక విధాలుగా తమకు చాలా ముఖ్యమైన భాగస్వామి అని భావిస్తున్నామని అన్నారు. భారత్ మరియు అమెరికాల మధ్య వాణిజ్య చర్చలు బాగా పనిచేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సుంకాల గురించి తనను ఎవరూ ప్రశ్నించలేదని అన్నారు. భారతదేశం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని అన్నారు. ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు మద్దతుగా అన్ని విధాలా సహకారం అందిస్తామని పునరుద్ఘాటించారు. జమ్ముకాశ్మీర్‌లోని పహల్గాంలో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిలో 26మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు సహకరిస్తాం : యుఎస్ హౌస్ స్పీకర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES