Wednesday, May 7, 2025
Homeతెలంగాణ రౌండప్హలియాలో పూర్వవిద్యార్థుల సమ్మేళనం

హలియాలో పూర్వవిద్యార్థుల సమ్మేళనం

- Advertisement -

నవతెలంగాణ హాలియా
అనుముల మండలం, హాలియాలోని నిర్మల ఉన్నత పాఠశాలలో 10 వతరగతి 2000 సంవత్సరపు పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నారు. 25 సంవత్సరాల తర్వాత విద్యార్థులందరూ తమ తమ స్నేహితులను కలుసుకొని ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఆనాటి అల్లరిని గుర్తు చేసుకున్నారు. ఇప్పటి యోగక్షేమాలు అడిగి తెలుసుకుని బాల్యపు స్మృతులను అన్నిటిని నెమరు వేసుకున్నారు. పాఠశాల ప్రాంగణం అంతా తిరిగి చూసి తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుతెచ్చుకున్నారు. అలనాటి మధురస్మతులను, సరదా ఆటలను ఎన్నింటినో తలుచుకొని భావోద్వేగానికి గురయ్యారు. సహపంక్తి భోజనాలు చేశారు. సరదా ఆటలు ఆడారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకున్నారు. కార్యక్రమంలో భాగంగా తమకు విద్యాబుద్ధులు నేర్పించి, అక్షర జ్ఞానంతో తమ భవితకు పునాదులు వేసిన గురువులను ఆహ్వానించి, పాద పూజ చేసి, గొప్పగా సన్మానించి, గురువులపై తమ గౌరవాన్ని చాటుకున్నారు. ఎంతో విధేయతతో, గొప్ప మనసు కలిగి, ఉన్నత శిఖరాలను చేరిన తమ తమ విద్యార్థులను చూసి గురువుల కళ్ళు ఆనంద భాష్పాలు వర్షించాయి. తమ కళ్ళముందే చిన్ని మొక్కలు వంటి విద్యార్థులు పెరిగి పెద్దయి వృక్షాలుగా ఇలా ముందట కనిపిస్తుంటే మనసు నిండి పోయిందని, ఇంతకన్నా మాకేం కావాలని, మా జీవితం ధన్యమైందని, గురువులంతా ముక్తకంఠంతో, ఆనందం వ్యక్తపరిచారు. తమ గురువులను సగగౌరవంగా సత్కరించుకున్న విద్యార్థులు రోజంతా ఎంతో సంతోషంగా గడిపారు.ఇట్టి కార్యక్రమంలో ఉపాధ్యాయులు సిస్టర్ విల్మా, సిస్టర్ మాణిక్యమ్మ, వి. వెంకటేశ్వరరెడ్డి, చెన్ను వెంకటేశ్వర్ రెడ్డి, పిఇటీ దోమినిక్, సత్యనారాయణ, రాములు, సయ్యద్ ఖమృద్ధిన్, విజయ, జయ, విజయజ్యోతి, లిల్లీ, నిర్మల 2000వ సంవత్సరం 10 వ తరగతి విద్యార్థులందరు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -