నవతెలంగాణ-కామారెడ్డి: తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని తెలంగాణ విశ్వవిద్యాలయం పార్ట్ టైమ్ అధ్యాపకులు బుధవారం ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యేతో మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయాలలో తాము గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తూ నయా బానిసత్వానికి గురవుతున్నామని తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం జీ.వో 21 తీసుకువచ్చి కనీసం తమ సర్వీసులను పరిగణలోకి తీసుకోకుండా రెగ్యులర్ నోటిఫికేషన్ ఇవ్వడం సరికాదని తెలిపారు. తమకు మినిమం టైం స్కేల్ అమలు చేసి రెగ్యులర్ రిక్రూట్మెంట్‌లో మొదటి ప్రాధాన్యత కల్పించాలని వారు కోరారు. అనంతరం వారి సమస్యల పట్ల ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ.. పార్ట్ టైమ్ అధ్యాపకుల న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ యూనివర్సిటీ ప్రెసిడెంట్ డా. ప్రసన్న, డా. ఇంద్రకరణ్ రెడ్డి. డా. గంగాధర్. డా.రఘువీర్. డా.అలోక్, డా.పోతన్న, శ్రీకాంత్ ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేకు పార్ట్ టైం అధ్యాపకుల వినతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES