Wednesday, May 7, 2025
Homeతెలంగాణ రౌండప్ఉచిత వేసవి శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

ఉచిత వేసవి శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

- Advertisement -
  • భీంగల్ ఎంఈఓ
    నవతెలంగాణ – భీంగల్ 

భీoగల్ మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నటువంటి ఆరవ తరగతి నుండి పదవ తరగతి విద్యార్థులకు ఉచిత వేసవి శిక్షణ శిబిరాల సమ్మర్ క్యాంప్, జిల్లా పరిషత్ హైస్కూల్ భీంగల్ నందు నిర్వహించబడుతుందని భీంగల్ మండల విద్యాశాఖ అధికారి డి. స్వామి మంగళవారం రోజు పత్రిక సమావేశంలో తెలియజేశారు. ఇందులో మ్యూజిక్ డ్యాన్స్, డ్రాయింగ్ యోగా, కరాటే నేర్పించడం జరుగుతుందని అలాగే ప్రతి ఈవెంట్ ఒక గంట సేపు ఉంటుందని,ఈ క్యాంప్ ఈనెల 10వ తారీకు నుండి 24 తారీకు వరకు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుందని తెలియజేశారు. అలాగే విద్యార్థులకు స్నాక్స్ అందజేస్తారని తెలియజేశారు. ఇట్టి అవకాశాన్ని  మండలంలోని విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు ఇట్టి సమ్మర్ క్యాంప్ లో పాల్గొనే విద్యార్థులు రేపటినుండి భీంగల్ హై స్కూల్ లో తమ వివరాలను ఉదయం 8 గంటల నుండి నమోదు చేసుకోవాలని మండల విద్యాశాఖ అధికారి తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -