నవతెలంగాణ-హైదరాబాద్: చైనా వేదికగా జరుగుతున్న షాంఘై సహకార సమావేశంలో యూఎస్‌పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు జిన్‌పింగ్. ప్రచ్చన్న యుద్దానికి దారి తీస్తున్న విధానాలకు దూరంగా ఉండాలని, బెదిరింపు ధోరణులకు, కక్షపూరిత చర్యలకు దిగడం సరైంది కాదన్నారు. ప్రపంచంలో శాంతి నెలకొనడానికి షాంఘై సభ్య దేశాలు నిరంతరం కృషి చేస్తాయని, అందుకు తమ సభ్యదేశాల సహకారం ఎల్లప్పుడు ఉంటుందని తెలియజేశారు.
సభ్యు దేశాలన్ని విభేదాలను గౌరవించి, వ్యూహాత్మక కమ్యూనికేషన్‌ను కొనసాగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అదే వివిధ అంశాంలపై సంఘీభావం సహకారాన్ని బలోపేతం చేసే దిశ ముందడుగు వేసుకోవాలని ఆయన సూచించారు. ఆర్థిక రంగంలో SCOలోని 26 దేశాల భాగస్వామ్యం దాదాపు USD 30 ట్రిలియన్ల మొత్తం ఆర్థిక ఉత్పత్తిని ఎలా కవర్ చేస్తుందో ఆయన వివరించారు.
ఈ ఏడాదిలోపు షాంఘై సహకార సంస్థ సభ్య దేశాలకు 2 బిలియన్ యువాన్లు (సుమారు USD 281 మిలియన్లు) గ్రాంట్లను అందించాలని, రాబోయే మూడు సంవత్సరాలలో SCO ఇంటర్‌బ్యాంక్ కన్సార్టియం సభ్య బ్యాంకులకు చైనా అదనంగా 10 బిలియన్ యువాన్ల రుణాలను జారీ చేస్తుందని ఆయన ప్రకటించారు.