Wednesday, May 7, 2025
Homeట్రెండింగ్ న్యూస్పాఠశాలలో ప్రిన్సిపల్‌.. మహిళా ఉద్యోగి సిగ పట్టు

పాఠశాలలో ప్రిన్సిపల్‌.. మహిళా ఉద్యోగి సిగ పట్టు

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్: పాఠశాలలో ప్రిన్సిపల్‌.. సాటి మహిళా ఉద్యోగి సిగ పట్టు పట్టి కొట్టుకున్నారు. ఎందరో విద్యార్థులకు ఆదర్శంగా నిలవాల్సిన ప్రిన్సిపల్‌ తన స్థాయిని మరిచి సాటి మహిళా ఉద్యోగినిపై చేయి చేసుకొని దురుసుగా స్రవర్తించారు. దీంతో సదరు ఉద్యోగిని తిరగబడటంతో.. పాఠశాల రణరంగంగా మారింది. వారిని అడ్డుకోవాల్సిన వారు చుట్టూ నిలబడి చోద్యం చూస్తూ.. జుట్లు పట్టుకొని తన్నుకోవడాన్ని కెమేరాల్లో బంధించే పనిలో నిమిగ్నమయ్యారు. చివరికి అక్కడ పనిచేసే ఓ మహిళ వారిని విడదీసింది. తాజాగా ఈ వీడియో వైరల్‌గా మారింది. 
మధ్యప్రదేశ్‌లోని ఖర్‌గోనే అనే ప్రాంతంలోని ఏకలవ్య ఆదర్శ్‌ స్కూల్‌లో ఈ ఘటన చోటు చేసుకొంది. ఏదో విషయంలో లైబ్రరేరియన్‌, ప్రధానోపాధ్యాయురాలి మధ్య వాగ్వాదం మొదలైంది. దీంతో లైబ్రరేరియన్‌ తన ఫోన్‌లో దానిని రికార్డు చేయడం మొదలుపెట్టడంతో.. ఆ ప్రిన్సిపల్‌ ఆగ్రహం కట్టలు తెంచుకొని ఆమెను చెంపదెబ్బ కొట్టి.. ఫోన్‌లాక్కొని నేలపైకి విసిరింది. దీంతో ఆ ఉద్యోగిని అవాక్కై.. ఎంత ధైర్యం నాపైనే చేయి చేసుకొంటావా..? అని ప్రశ్నించి తన ఫోన్‌ తీసుకోవడానికి వెళ్లింది. ఆ ప్రిన్సిపల్‌ మరోసారి ఫోన్‌ లాక్కొని నేలపైకి విసరడంతో అది పగిలిపోయింది. దీంతో ఆ ఉద్యోగిని తిరిగబడి ప్రిన్సిపల్‌ చేతిపై కొట్టింది. ఇక ఇద్దరి మధ్య పూర్తిస్థాయి కొట్లాట మొదలైంది. పరస్పరం జుట్టు పట్టుకొని తన్నుకొన్నారు.  ఇంతలో ఓ బాలుడు అమ్మా వదిలేయ్‌ అనడం వీడియోలో వినిపించింది. కానీ, ఎవరూ అతడిని పట్టించుకోలేదు. ఇక చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు వారిని విడిపించకుండా ఫోన్‌లో వీడియో తీసేపనిలో బిజీ అయిపోయారు. అదే సమయంలో పాఠశాలలో పనిచేసే మహిళ వారిని అడ్డుకొంది. ఈ వీడియో వైరల్‌ కావడతో  ప్రిన్సిపల్‌, లైబ్రరేరియన్‌లను అక్కడి నుంచి అసిస్టెంట్‌ కమిషనర్‌ కార్యాలయానికి బదిలీ చేశారు. 

నెటిజన్లు ఈ వీడియోపై పలు రకాలుగా స్పందించారు. ‘‘ అక్కడ ఉన్న వాళ్లలో క్లీనింగ్‌ చేసే ఆ మహిళే మంచిదిలా ఉంది. కనీసం వారిని విడదీయడానికైనా ప్రయత్నించింది. మిగిలినవారు విద్యావంతుల్లానే ఉన్నారు.. కానీ, వారి కంటే ఆమె వివేకవంతురాలు’’ అని ఓ యూజర్‌ ఎక్స్లో పోస్టు చేశారు. ‘‘లైబ్రరేరియన్‌ వీడియో రికార్డు చేసి ఓవర్‌ యాక్టింగ్‌ చేసింది. ఆమెకు తగిన ప్రతిఫలం వచ్చింది. ఈ టిక్‌టాక్‌ సంస్కృతి ప్రజలను నాశనం చేసింది. ప్రతిది వీడియో మెటిరీయల్‌గా మారిపోయింది’’ అని మరో యూజర్‌ పేర్కొన్నాడు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -