Wednesday, September 3, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంఆప్ ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల కేసు...అరెస్టు చేస్తుండ‌గా పోలీసుల‌పై కాల్పలు

ఆప్ ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల కేసు…అరెస్టు చేస్తుండ‌గా పోలీసుల‌పై కాల్పలు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: పంజాబ్‌లో ఓ ఆప్ ఎమ్మెల్యే హర్మీత్ పఠాన్‌మజ్రా వీరంగం సృష్టించారు. అత్యాచారం ఆరోపణలపై మంగళవారం ఉదయం కర్నాల్‌లో స‌దురు ఎమ్మెల్యేను పోలీసులు అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్తుండగా ఎమ్మెల్యే, అతని సహాయకులు పోలీసులపై కాల్పులు జరిపారు. వెంట‌నే అడ్డుకునే ప్రయత్నం చేసినా కానిస్టేబుల్‌ను కూడా ఢీకొని పారిపోయారు. వాహనాలను పోలీసులు అడ్డుకోగా.. మరొక వాహనంలో ఎమ్మెల్యే తప్పించుకుని పారిపోయారు. ప్రస్తుతం పోలీస్ బృందాలు స‌దురు ఎమ్మెల్యేను గాలిస్తున్నాయి.

హర్మీత్ పఠాన్‌మజ్రా.. పంజాబ్‌లోని సనౌర్‌ నియోజకవర్గం. పఠాన్‌మజ్రాపై అత్యాచారం, మోసం, క్రిమినల్ బెదిరింపు ఆరోపణల కేసులు నమోదయ్యాయి. ఎమ్మెల్యే విడాకులు తీసుకున్నట్లు అబద్ధం చెప్పి తనతో వైవాహిక సంబంధం పెట్టుకున్నట్లు ఓ మహిళ ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. లైంగిక దోపిడీ, బెదిరింపులు, అశ్లీల చిత్రాలు పంపించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad