నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం నవ భారత్ సాక్షరతా (ఉల్లాస్) మండల స్థాయి శిక్షణా కార్యక్రమం మండల విద్యాధికారి నేర ఆంధ్రయ అధ్యక్షతన నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.15 ఏండ్ల పైబడిన నిరక్షరాస్యులైన వయోజనులందరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్ది, దేశ అక్షరాస్యతను పెంచే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం ఉల్లాస్(ఉల్లాస్ – అండర్ స్టాండింగ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ) అనే కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. దానిలో భాగంగా మహిళలను అక్షరాస్యులుగా మార్చితే కుటుంబం మొత్తం అభివృద్ధి పథంలో నడుస్తుందని భావించి ముందుగా మహిళా స్వయం సహాయక సంఘాలలో నిరక్షరాస్యులుగా ఉన్న మహిళలను అక్షరాస్యులుగా మార్చే కార్యక్రమాన్ని ఈ నెల 8వ తేదీ నుండి ప్రారంభిచుకోవాలని ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ తెలిపారు.
అనంతరం మండల విద్యాధికారి ఆంధ్రయ్య మాట్లాడుతూ చదువు యొక్క ప్రాధాన్యాన్ని, నిత్య జీవితంలో చదువుకోనీ వారు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో తెలిపి, వారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దే బృహత్తర కార్యక్రమంలో మనందరం భాగస్వాములు కావాలన్నారు.ఈ కార్యక్రమంలో స్వయం సహాయక సంఘాలలో నిరక్షరాస్యులను ఎలా గుర్తించాలో, వారికి విద్య నేర్పడానికి వాలంటరీ టీచర్ లను ఏ విధంగా గుర్తించాలో, వాలంటరీ టీచర్ లు ఎలా బోధన చేయాలనే విషయాలపై శిక్షణను ఇచ్చారు. ఈ శిక్షణ కార్యక్రమానికి హాజరైన ప్రతి గ్రామ పంచాయతీ నుండి ఒక ఉపాధ్యాయుడు, స్వయం సహాయక సంఘాల వివోఏ లకు మండల రిసోర్స్ పర్సన్స్ సిహెచ్. శంకర్ గౌడ్, పసుపుల ప్రసాద్ శిక్షణ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం కిరణ్ కుమార్, స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు పసుపుల సాయన్న, బషీరాబాద్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు కనక గంగాధర్, ఐకేపి సీసీలు, మండలంలోని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
ఉల్లాస్ మండల స్థాయి శిక్షణ కార్యక్రమం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES