నవతెలంగాణ-హైదరాబాద్: జార్ఖండ్‌లోని రాంచీ వేదికగా నిర్వహించిన సంవిధాన్ బచావో’ సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే..కేంద్ర ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. పహల్గాం దాడిపై మూడు రోజల ముందే ప్రధాని మోడీకి నిఘా వర్గాల నుంచి సమాచారం అందిందని, అయినా కూడా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని ఆయన చెప్పారు. ముందస్తు సమాచారమన్నా..పహల్గాంలో మరింత భద్రత ఎందుకు కల్పించలేదని మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పహల్గాం ఉగ్రదాడి ఘటనకు సంబంధించి నిఘా వైఫల్యం ఉందని ప్రభుత్వం అంగీకరించిదని, ఇంటెలిజెన్స్‌ను పటిష్ఠ పరచుకుంటామని వాళ్లే చెప్పారని ఆయన గుర్తు చేశారు. ఏదేమైనా పహల్గాం దాడికి వ్యతిరేకంగా పాకిస్థాన్‌పై ఎటువంటి చర్య తీసుకున్నా ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతుగా నిలుస్తుందని మల్లికార్జున ఖర్గే మరోసారి స్పష్టం చేశారు.
పహల్గాం దాడిపై ప్రధానికి ముందే సమాచారం అందింది: మల్లిఖార్జున ఖర్గే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES