శ్రీ విష్ణు, ఇవానా, కేతిక శర్మ నాయకానాయికలుగా నటించిన చిత్రం ‘#సింగిల్’. కార్తీక్ రాజు దర్శకుడు. గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ సమర్పణలో కళ్యాణ్ ఫిల్మ్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మించారు. ఈ సినిమా ఈనెల 9న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ కేతిక శర్మ మీడియాతో పలు విశేషాలను షేర్ చేసుకున్నారు.
గీతా ఆర్ట్స్‌లో వర్క్ చేయాలని ఎప్పటినుంచో నా కోరిక. ఆ కోరిక ఈ సినిమాతో తీరింది. అల్లు అరవింద్ ఒక సినిమాని ప్రజెంట్ చేస్తున్నారంటే కచ్చితంగా ఆ సినిమాలో అద్భుతమైన కంటెంట్ ఉంటుంది. కథ విన్నప్పుడు చాలా ఎంజారు చేశాను. ఇది వెరీ ఫన్ ఫిల్డ్ ఫిలిం. పర్ఫెక్ట్ స్టార్ కాస్ట్‌తో వస్తున్న వెరీగుడ్ ఎంటర్‌టైనర్.
ఇందులో పూర్వా అనే క్యారెక్టర్‌లో కనిపిస్తాను. వెరీ ఇండిపెండెంట్, ప్రాక్టికల్ గర్ల్. ఈ కథలో ఎమోషన్ నా క్యారెక్టర్ ద్వారానే వస్తుంది. కొన్ని సీరియస్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ ఇది అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్. ఇందులోని లవ్‌స్టోరీ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది.
శ్రీ విష్ణు కామెడీ టైమింగ్ చాలా యూనిక్‌గా ఉంటుంది. ఆయనతో వర్క్ చేయడం రియల్లీ గ్రేట్ ఎక్స్‌పీరియన్స్. డైరెక్టర్ కార్తీక్ రాజు వెరీ ఫ్యాషనేట్ ఫిలిం మేకర్. ఆయనకి చాలా క్లియర్ విజన్ ఉంది. ఈ సినిమాని హెల్దీ ఎంటర్‌టైనింగ్ మూవీగా తీర్చిదిద్దారు.
కామెడీ చాలా డిఫికల్ట్. కామెడీ చేయడం అంత ఈజీ కాదు. ఇందులో ఇంటర్వెల్ బ్యాంగ్ నాకు చాలా ఛాలెం జింగ్‌గా అనిపించింది. పైగా దీన్ని శ్రీవిష్ణు కామెడీ టైమింగ్‌కి మ్యాచ్ చేయటం పెద్ద సవాల్‌గా అనిపించింది.
మా సినిమా 9న రిలీజ్ అవుతుంది. అందరూ ఫ్యామిలీతో కలిసి ధియేటర్స్‌కి రండి. ఇది సమ్మర్ రొమాంటిక్ కామెడీ ఆఫ్ ద ఇయర్. ప్రేక్షకులకి కావలసిన నవ్వులు పంచే సినిమా. మీ అందర్ని కచ్చితంగా అలరిస్తుంది.
హిందీలో ఒక సినిమా చేస్తున్నాను. అలాగే తమిళం, తెలుగు బైలింగ్వల్ ఒకటి చేస్తున్నాను. గీతా ఆర్ట్స్‌లో రాబోతున్న రష్మిక చేసిన ‘గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాని చేయాలని ఉంది. అందులో రష్మిక క్యారెక్టర్ వెరీ బ్యూటీఫుల్. అలాంటి క్యారెక్టర్ చేయడం నా డ్రీమ్. అలాగే సాయి పల్లవి, కీర్తి సురేష్ చేస్తున్నట్లు పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ కూడా చేయాలని ఉంది.
ఆద్యంతం నవ్విస్తుంది..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES