Friday, September 5, 2025
E-PAPER
spot_img
Homeక్రైమ్స్కూల్‌ బస్సు కింద పడి చిన్నారి మృతి..పాఠశాలను సీజ్‌

స్కూల్‌ బస్సు కింద పడి చిన్నారి మృతి..పాఠశాలను సీజ్‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : స్కూల్‌ బస్సు కింద పడి చిన్నారి మృతిచెందిన ఘటన గురువారం నల్లగొండలో జరిగింది. నల్ల గొండ మండలంలోని తొరగల్‌కు చెందిన చింతపల్లి జస్మి త(4) మాస్టర్స్‌మైండ్‌ పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతోంది. ఇంటి నుంచి స్కూల్‌ బస్సులో బడికి వచ్చింది. బస్సులోని విద్యార్థులు అంతా దిగి ఒక్కొక్కరుగా తరగతి గదులకు వెళ్తున్నారు. ఈక్రమంలో జస్మిత సైతం తోటి విద్యార్థులతో కలిసి తరగతి గదిలోకి వెళ్తుండగా డ్రైవర్‌ గమనించకుండా బస్సును కదలించాడు. దీంతో బస్సు విద్యార్థినికి తగిలి తీవ్రమైన గాయాలు కావడంతో పాఠశాల యాజమాన్యం నల్లగొండ ప్రభుత్వ దవాఖానకు తరలిచించారు.

చిన్నారిని పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు తెలిపారు. దీంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరయ్యారు. బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే చిన్నారి చనిపోయిందని బాలిక తల్లి రాధిక ఆరోపిస్తోం ది. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు కాసులకు కకుర్తి పడి సూల్‌ బస్సులకు శిక్షణ పొందని డ్రైవర్లను పెడుతున్నారని, కనీసం బస్సుకు సహాయకులను కూడా నియమించలేదని వారు మండిపడ్డారు. బస్సులో ఆయాలు లేకపోవడం, డ్రైవర్‌ నిర్లక్ష్యంతో చిన్నారి జస్విత చనిపోయిందని ప్రజాసంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.

ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే వన్‌టౌన్‌ సీఐ రాజశేఖర్‌రెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బస్సు డ్రైవర్‌ విజయ్‌ను పోలీసుల అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

నల్లగొండ పట్టణం దేవరకొండ రోడ్డులోని మాస్టర్‌ మైండ్‌ పాఠశాలకు చెందిన విద్యార్థిని జస్మిత మృతికి పాఠశాల యాజ మాన్యమే కారణం అంటూ.. విచారణ పూర్తి అయ్యేంత వరకు పాఠశాలను సీజ్‌ చేయాలని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి డీఈవోకు ఆదేశాలు జారీ చేశారు. విచారణ పూర్తి చేసిన తరువాత తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad