- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఒడిసా సీఎం మోహన్ చరణ్ మాఝీ ప్రయాణిస్తున్న విమానాన్ని భువనేశ్వర్ ఎయిర్ పోర్టులో కాకుండా కలకత్తా విమానాశ్రయానికి మళ్లించారు. విమానం ల్యాండ్ అయ్యే సమయానికి వాతావరణంలో ప్రతికూలతలు ఏర్పడంతో సదురు విమానాన్ని కలకత్తాకు దారి మళ్లించామని ఎయిర్‌పోర్టు డైరెక్టర్ ప్రసన్న ప్రర్ధాన్ వెల్లడించారు. బుధవారం ఉదయం తిరుచిరాపల్లి నుండి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఆలస్యం అయింది. తరువాత ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేశామన్నారు. తాజాగా వాతావరణంలో ప్రతికూలత వల్ల కలకత్తాకు ఈ విమానాన్ని మళ్లించారు.
- Advertisement -



