విద్యార్థులకు వర్షాకాలంలో వచ్చే రోగాలపైన అవగాహన

– ఆయుర్వేదిక వైద్యాధికారి లలిత

నవతెలంగాణ –  జక్రాన్ పల్లి
విద్యార్థులకు వర్షాకాలంలో వచ్చే రోగాలపైన మండల ఆయుర్వేదిక వైద్యాధికారి లలిత బుధవారం అవగాహన కల్పించారు.జక్రాన్ పల్లి మండల కేంద్రంలో ని పాఠశాలలో లలిత ఆయుర్వేదిక్ డాక్టర్ పిల్లలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. దీనిలో భాగంగా వర్షాకాలంలో వచ్చే రోగాలను వాటికి సంబంధించిన నివారణోపాయాలను పిల్లలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి శ్రీనివాస్  ఇన్చార్జి ప్రధాన ఉపాధ్యాయులు సుధాకర్ మరియు పాఠశాల బృందం పాల్గొన్నారు.
Spread the love